సెంటిమెంట్స్, మనోభావాలు తెలుగు ఇండస్ట్రీలో ఊరికే దెబ్బతినేస్తుంటాయి. తెలుగులో సినిమాల్లో ఎక్కడైనా చిన్న తప్పు ఉంటే చాలా వాటిని పట్టుకుని ఉద్యమాలు చేయడానికి ఓ బ్యాచ్ ఎప్పూడు రెడీ గానే ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీ కూడా సెంటిమెంట్ ని నమ్మే వారు ఎక్కువే.
స్టార్ హీరోలు దగ్గరు నుంచి నిన్నమొన్ననే పరిశ్రమలోకి అడుగుపెట్టే కుర్ర హీరోలు వరకు సెంటిమెంట్ ని నమ్మే సినిమాలు చేస్తుంటారు. ఇక్కడ కథ కంటే సెంటిమెంట్ కే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది, చాలా మంది హీరోలు సక్సెస్ ఫార్మూలానే తమ సెంటిమెంట్ గా పెట్టుకోవడం హిట్లు కోడుతున్నామనుకుంటారు.
మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉందని ఆయన అభిమాన వర్గాల్లో ఇప్పుడు వాడి వేడిగా చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే చిరంజీవి దేవుడుని ముఖ్యాంశంగా కథలు యాక్సెప్ట్ చేసి సినిమాలు చేసిన ప్రతిసారీ అవి డిజాస్టర్స్ గా మారిపోయాయి అని మెగా అభిమానులు ఆందోళన పడుతున్నారు.
అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినప్పటికి మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా మొత్తం సింహాచలం దేవాస్థానం భూవివాదాలు మీదనే ఉంటుందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆచార్య మూవీ దేవుడు కథాంశంగా ఉండే అవకాశం ఉంది కాబ్బట్టి ఫ్యాన్స్ ఇప్పుడా ఫ్లాప్ సెంటిమెంట్ ని లేవనెత్తారు. ముఖ్యంగా ఆచార్య చిత్రాన్ని అంజీ సినిమాతో పోలుస్తున్నారు మెగా అభిమానులు. అంజీ కూడా అప్పట్లో ఆచార్య మాదిరిగానే భారీ అంచనాలు మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలిపోయింది. మరి ఆచార్య ఫేట్ ఎలా ఉండబోతుందో చూడాలి.











