తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. పలు డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు తీర్చేందుకు రైతు బంధు, రైతు భీమా పథకాలు ప్రవేశపెట్టానని అన్నారు. పేదల ఆకలి సమస్యల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ దివంగత ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. పేదలు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ 2 కిలోల బియ్యం పథకం ప్రవేశపెట్టారని, ఆయన వల్లే కొంత ఆకలి సమస్య తీరిందని గుర్తు చేశారు. ఆ పథకం నాకు చాలా బాగా నచ్చిందని, అందుకే పేదల సంక్షేమానికి పాటుపడుతున్నానని కేసీఆర్ అన్నారు.
ఎన్టీఆర్ కు కేసీఆర్ వినతిపత్రం
సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఓ అరుదైన సంఘటనను గుర్తుకుతెచ్చుకున్నారు. సిద్దిపేట జిల్లా కోసం అప్పటి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు సీఎం కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. అప్పుడు వినతిపత్రం ఇచ్చిన కేసీఆరే.. ఇప్పుడు స్వయంగా జిల్లాలను ఏర్పాటుచేసి కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించడం గొప్ప విషయం అని హరీశ్ రావు అన్నారు.
Must Read సిద్దిపేటలో కేసీఆర్ పర్యటన : భారీ భద్రత, ముందస్తు అరెస్టులు!











