సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అందించారు. జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును ఆదేశించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కాటగిరీల వారిగానే రైతు బంధు ఆర్థిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రేమలో మునిగితేలుతున్న స్టార్ హీరోయిన్ రకుల్…..బాయ్ ప్రెండ్ పేరును బయటపెట్టిన రకుల్
డ్రగ్స్ మాఫియాలో చిక్కి ఉక్కిరిబిక్కిరైన స్టార్ హీరోయిన్ రకుల్ మరోసారి వార్తల్లో నిలిచింది....