ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టీమ్ అంచనాలకు తగినట్టుగానే రాణిస్తోంది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైనప్పటికీ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్ సాధించింది. మరోవైపు టోర్నీని ఘనంగా ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ వరుస పరాజయాలతో డీలా పడింది.
ముంబై జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించింది. మరోవైపు, రాజస్థాన్ టీమ్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ రెండు టీమ్‌ల మధ్య తొలి మ్యాచ్ మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు అబుదాబిలోని షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియంలో జరుగబోతోంది.
ముంబై టీమ్ బలాలు
డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ముంబై టీమ్ ఈ టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శనే చేస్తోంది. మొదట్లో తడబడినా తర్వాత అద్భుతంగా పుంజుకుంది. రోహిత్ శర్మ, డికాక్, పోలార్డ్, పాండ్యా వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ చక్కగా రాణిస్తున్నారు. ఇషాన్ కిషన్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ముంబై బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా కనబడుతోంది. ఇక, బౌలింగ్ విభాగంలో ముంబై టీమ్ నెంబర్ వన్ అని చెప్పవచ్చు. బుమ్రా, ప్యాటిన్సన్, బుమ్రా వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నారు. స్పిన్ విభాగం కూడా మెరుగైన ప్రదర్శనే చేస్తోంది.
బలహీనతలు
ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబై టీమ్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చెన్నైతో మ్యాచ్‌లోనే ముంబై టీమ్ పేలవ ప్రదర్శన చేసింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో వైఫల్యం వల్ల ఓడింది. చిన్న చిన్న లోపాలు తప్ప ముంబై టీమ్‌లో పెద్దగా బలహీనతలు లేవనే చెప్పాలి. అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నప్పటికీ ప్రతిభావంతంగా ప్రదర్శన చేయలేకపోవడమే కాస్త నిరాశ పరుస్తోంది.
ముంబై టీమ్ (అంచనా)
డికాక్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ప్యాటిన్సన్, చాహర్, బౌల్ట్, బుమ్రా.
రాజస్థాన్ టీమ్ బలాలు
ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ టీమ్ అదిరిపోయే రీతిలో టోర్నీని ఆరంభించింది. జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అలాగే రాహుల్ తెవాటియా కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక, బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. జయదేవ్ ఉనద్కత్, జొఫ్రా ఆర్చర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలమవుతున్నారు.
బలహీనతలు
టాపార్డర్ వైఫల్యం రాజస్థాన్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. జాస్ బట్లర్, స్మిత్, శాంసన్ వైఫల్యం రాజస్థాన్‌ను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడించింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యం బౌలింగ్ విభాగం మీద ఒత్తిడి పెంచుతోంది. తక్కువ స్కోర్లను కాపాడుకోవడం బౌలర్లకు తలకు మించిన భారంగా మారుతోంది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాల్సి ఉంది.
రాజస్థాన్ టీమ్ (అంచనా)
జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, మనన్ వోహ్రా, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్, జొఫ్రా ఆర్చర్, టామ్ కర్రన్, జయదేవ్ ఉనద్కత్, వరుణ్ అరోన్.
మ్యాచ్ ఫేవరెట్
వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లోనూ విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజస్థాన్‌తో పోల్చుకుంటే ముంబై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ అవకాశాలనూ తీసిపారేయాలేం. టాపార్డర్ రాణిస్తే రాజస్థాన్ విజయావకాశాలు మెరుగుపడతాయి.