కథానాయకులతో పోలిస్తే కథానాయికల స్పాన్ చాలా తక్కువనే నానుడి ఉంది. అయితే నయనతార వంటి నాయికలను చూసినప్పుడు అది తప్పేమో అనిపిస్తుంది. తనతో వచ్చిన చాలామంది ఔట్ డేటెడ్ అయిపోయినా.. తాను మాత్రం ఇంకా హీరోయిన్ గా ఫుల్ బిజీగా సాగుతుంది నయన. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ మరోవైపు అగ్ర కథానాయకుల సరసన ఆడిపాడే అరుదైన ఆఫర్లు అందుకుంటుంది.
సినిమాల విషయంలోనే కాదు రిలేషన్‌షిప్స్‌లోనూ నయనతార రూటే సెపరేటు. ఉత్తరాది హీరోయిన్స్‌తో పోల్చుకుంటే దక్షిణాది భామలు రిలేషన్‌షిప్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఎవరితోనైనా ప్రేమలో ఉన్నా అలాంటివి పెళ్లికి దారతీసిన సంఘటనలే ఎక్కువ. ఇక సౌత్ లవ్‌స్టోరీస్‌లో నయనతార రిలేషన్‌షిప్స్ ట్రెండింగ్‌లో ఉంటాయి. శింబు, ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన నయన ఇప్పుడు విఘ్నేశ్ శివన్‌తో గాఢమైన రిలేషన్‌షిప్‌లో ఉంది.
ఇప్పటికే ప్రేమలో రెండుసార్లు ఘోరంగా విఫలమైన నయనతార ఈసారి ఎలాగైనా తన లవ్‌ను సక్సెస్ తీరాలకు చేర్చాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఖాళీ దొరికితే చాలు ప్రియుడు విఘ్నేశ్ శివన్ చెంతకు చేరిపోతుంది. తమ మధ్య రిలేషన్‌ను ఎప్పుడో పబ్లిక్ చేసిన ఈ జంట తమ ప్రేమను ప్రదర్శించడానికి ఎలాంటి అకేషన్ ను వదలరు. అయితే పెళ్లి విషయంలో విఘ్నేశ్ కి నయన ఓ కండిషన్ పెట్టినట్టు కోలీవుడ్ టాక్. ఆమధ్య ప్రభాస్ ‘బాహుబలి’ పూర్తైతేనే కానీ పెళ్లి చేసుకోను అన్నట్టు.. తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తేనే కానీ పెళ్లి పీటలెక్కనంటుందట నయనతార.
గ్లామరస్ రోల్స్ తో పాటు ‘శ్రీరామరాజ్యం’, ‘అరమ్’ వంటి చిత్రాలలో పెర్ఫామెన్స్ ను పీక్స్ లో చూపించింది నయన. కానీ ఈ మలయాళీ భామకు జాతీయ అవార్డు మాత్రం దక్కలేదు. అలాగని జాతీయ అవార్డు పొందడం అనేది కూడా అంత ఆషామాషీ ఏమీ కాదు. గడిచిన రెండు దశాబ్దాలలో అవార్డీస్ ను ఓసారి అవలోకనం చేసుకుంటే మీరాజాస్మిన్, ప్రియమణి, కీర్తి సురేశ్ వంటి ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. మొత్తంమీద.. నయనతార నేషనల్ అవార్డ్ కోరిక ఎప్పుడు తీరేనో? విఘ్నేశ్ తో పెళ్లి ఎప్పుడు జరిగేనో? చూడాలి.











