దేశ ప్రధాని నరేంద్ర మోడీని 50 శాతం మంది చైనా దేశ ప్రజలు అభిమానిస్తున్నారని ఓ కథనం అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ కథనాన్ని ప్రచురించింది ఎవరో కాదు? చైనాకు చెందిన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్. తమ అధ్యక్షుడు జిన్ పింగ్ కంటే మోడీకే మద్దతు తెలుపుతున్నట్లు సర్వేలలో తేలింది. సరిహద్దులలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లో చేసిన సర్వేలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు కేవలం 30 శాతం మంది మాత్రమే మద్దతు తెలుపుతున్నారని తేలింది. మోడీకి ఇంత ఎత్తులో మద్దతు రావడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ సర్వే రిపోర్టుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
గ్లోబల్ టైమ్స్ అధికారిక పత్రిక. కమ్యూనిస్ట్ చైనాలో భావప్రకటన స్వేచ్ఛ కానీ పత్రికా స్వేచ్ఛ కానీ మరే స్వేచ్ఛకానీ ఉండవు. ప్రభుత్వ అనుమతి లేనిదే ఈ పత్రికలో ఇండియా అనుకూల కథనాలు వస్తాయనేది అనుమానమే. చైనా ప్రభుత్వం ఏది చెబితే అది చేయడం అక్కడి పత్రికలకు మాత్రమే కాదు చాలా వ్యవస్థలకు అలవాటే. గ్వాలన్ లోయ ఘటన జరిగినప్పుడు ఇదే పత్రిక భారత్ ఆక్రమణ చేసింది అని గొంతుచించుకొని అరిచింది. వరుసగా ఆ పత్రిక వెలువరించిన కథనాలలో భారత్ ను బెదిరిచింది కూడా ఈ పత్రికే. అలాంటిది చైనా పత్రికలో మన దేశ ప్రధానికి మద్దతు భారీగా పెరిగిందని కథనాలు రావడంపై మాత్రం సందేహాలు నెలకొన్నాయి. ఇలాంటి కథనాల వెనుక కార్పొరేట్ లాబీయింగ్ ఉందనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
గ్వాలన్ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా చైనాకు చెందిన ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో చైనాకు చెందిన పెద్ద కంపెనీలు భారత్ లాంటి పెద్ద మార్కెట్ ను కోల్పోయాయి. టిక్‌టాక్, వివో, హువాయ్ లాంటి దిగ్గజ కంపెనీలు పెద్ద మొత్తంలో నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే ‘హువాయ్’ కంపెనీ వేసిన మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఈ కథనాలు వచ్చాయనే వార్తలు వినబడుతున్నాయి. గ్లోబల్ టైమ్స్ పత్రికలో మొదటి నుంచి ఎక్కువ యాడ్స్ ఇచ్చేది హువాయ్ కంపెనీనే. చైనాకు చెందిన ఈ అతి పెద్ద కంపెనీని భారత్ లో నిషేదించిన తరువాత మిగిలిన దేశాలు కూడా నిషేదించాయి. దాదాపు అన్నీ దేశాలు నిషేధం విధించడంతో హువాయ్ కష్టాల కడలిలో చిక్కుకుంది.
ఈ దశలో తమ సమస్యల నుంచి బయట పడాలనే ఉద్దేశంతో హువాయ్ కంపెనీ ఇండియాను మచ్చిక చేసుకోవాలని ప్లాన్ చేసిందని అర్ధమవుతోంది. భారత్ నుంచి అనుమతి పొందితే మిగతా దేశాలలో కూడా తమకు ఎదురులేకుండా పోతోందని హువాయ్ ఆలోచన చేసినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎత్తుల్లో బాగంగానే చైనా ప్రజలు మంచివారు అనే అభిప్రాయం కలిగేలా ఈ సర్వే ప్రకటనలు చేస్తుందని సమాచారం. డ్రాగన్ దేశమే కాదు ఆ దేశ ప్రజలు కూడా ఎంత మేదావులో ఈ మాస్టర్ ప్లాన్ చూస్తే అర్ధమవుతోంది.