అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించిన భవంతులను అమ్మాలని జగన్ ప్రభుత్వం అనుకోవడం సరికాదు. అసలు ఈ భవంతులను అమ్మకానికి పెడితే కొనే నాధుడుంటాడా అన్నది నా ప్రశ్న. ఇప్పటికే రాజధాని తరలింపు అంశంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో భూములనే కొనడానికి దిక్కులేదు…. అందులోని భవంతులను ఎవరు కొంటారు? ప్రభుత్వం ఈ భవంతులను అమ్మాలనుకుంటే నష్టానికే అమ్మాల్సి ఉంటుంది. అసలు ఎంత ఖర్చు పెట్టి నిర్మాణాలు చేశారు? అమ్మితే ఎంత వస్తుంది ? అనేది ప్రభుత్వం దగ్గర లెక్క ఏదైనా ఉందా? అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ భవంతులను ఎవరైనా కొనడం సాధ్యమా అన్నదే నా ప్రశ్న. ఇలాంటి ఆలోచను ప్రభుత్వం విరమించుకుంటే మంచిదని నా సూచన. ఈ పరిస్థితుల్లో వీటిని కొనడానికి ఎవరూ ముందుకు రారు. వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకుంటే మంచిది.
– సుబ్బారావు, మంగళగిరి
బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!
తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....











