September 15, 2026 2:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

‘యాక్షన్ కట్’ కు  ధైర్యం ఉందా?

కేంద్రం కూడా సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చేసింది. ఇది కేవలం లాంఛనం. అనుమతుల్తో పాటు బోలెడు జాగ్రత్తలు చెప్పింది. హెచ్చరికలు చేసింది. మరి ఇన్ని పరిమితుల మధ్య అసలు సినిమా షూటింగులు ఇదివరకటి స్థాయిలోనే మొదలు అవుతాయా? సాధ్యమేనా?

August 24, 2020 at 7:37 AM
in Editorial, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణ ఏపీ ల్లో ఉండే ప్రజలకు కేంద్రప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చిందనే వార్త అంత కొత్తగా అనిపించదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఆల్రెడీ గతంలోనే అనుమతులు వచ్చాయి. తెలుగు సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో విడతలు విడతలుగా చర్చలు జరిపి మొత్తానికి అనుమతులు సాధించుకున్నారు. పెద్ద దర్శకులు కొందరు ట్రయల్ షూట్స్ చేసి.. ‘ఇదిగో ఇలా జాగ్రత్తగా చేస్తాం’ అంటూ ప్రభుత్వానికి చెప్పారు.. అనుమతులు వచ్చాయి. అయితే చాలా కొద్ది రోజులకే బ్రేకులు పడ్డాయి. టీవీ సీరియళ్ల షూటింగుల్లో పాల్గొన్న పలువురికి కరోనా సోకింది. దెబ్బకు షూటింగులు చాలావరకు నిలిచిపోయాయి. 

ఇప్పుడు కేంద్రం అనుమతులు ఇవ్వడం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు సంబంధించి మాత్రమే. ఇదివరకే అనుమతి ఉన్న టాలీవుడ్ కు దీని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. కానీ.. కేంద్రం ఉత్తర్వుల్లో మార్గదర్శకాలు మాత్రం.. చాలా విపులంగా స్పష్టంగా ఉన్నాయి. గట్టి నిబంధనలే పెట్టారు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షూటింగులకు అనుమతులు వచ్చాయి సరే.. షూటింగులు చేసే ధైర్యం సినీ పరిశ్రమ పెద్దలకు ఉన్నదా? అనేది! ఎందుకంటే.. ఏవైపు నుంచి కరోనా ముప్పు ముంచుకు వస్తుందో తెలియదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కరోనాకు అవకాశం లేదని గ్యారంటీ చెప్పడానికి లేదు. అంత ప్రమాదానికి ఎదురు నిలిచి సినిమా షూటింగులు చేయాల్సిన అవసరం ఏముంది? అనేది పలువురి అభిప్రాయంగా ఉంది. 

అసలు షూటింగ్ వంటి కార్యక్రమం ఏమీ లేకుండానే సినీ ప్రముఖులు చాలా మంది కొవిడ్ బారిన పడుతున్నారు. అలాంటిది షూటింగ్ కూడా అంటే.. ఏం జరుగుతుందో అనే భయం వారిలో ఉంది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి.. గతంలో చిరంజీవి, రాజమౌళి, నాగార్జున వంటి వాళ్లంతా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి షూటింగులకు అనుమతులు తీసుకున్నారు. కానీ.. ఇప్పటిదాకా చిరంజీవి షూట్ మొదలు కాలేదు. నాగార్జున బిగ్ బాస్ ప్రమోషన్ కోసం మాత్రం షూట్ చేశారు. రాజమౌళికి కరోనా సోకింది. ఇలా పరిస్థితులు నానా రకాలుగా ఉన్నాయి. ఆ సమయంలో ఒక్క బాలకృష్ణ మాత్రమే.. షూటింగులకోసం అనుమతులు అడగలేదు. పైగా.. ‘ఇప్పుడంత తొందరేముంది. కరోనా సమసిపోయే వరకు ఆగవచ్చు కదా’ అనే తరహాలో మాట్లాడారు. 

జాగ్రత్తలు చాలా ఎక్కువగా తీసుకునే సినీ ఇండస్ట్రీకి కూడా.. కోవిడ్ షూటింగ్ మార్గదర్శకాల పేరిట ప్రభుత్వం విధించిన నిబంధనలు భారమే. మరి ఇపుడు కేంద్రం అనుమతులు రాగానే.. ఎగబడి షూటింగులు మొదలైపోతాయా? ఇప్పటిలాగానే స్వయం నిషేధం వంటిదే కొనసాగుతుందా? అనేది అర్థం కావడం లేదు.

ఎవరి లాభం వారు చూసుకున్నారా?

గతంలో టాలీవుడ్ ప్రముఖుల.. ప్రభుత్వాల్ని షూటింగులకు అనుమతులు అడిగినప్పుడు.. ఇండస్ట్రీ స్వలాభం మాత్రమే చూసుకున్నారు. ప్రత్యేకించి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు, ఎక్కువకాలం షూటింగ్ ఆగితే నష్టాలు వస్తాయి గనుక.. పరిమితమైన వనరులతో వాటి పని కొనసాగించడం గురించి, ఆరకంగా నష్టం తగ్గించుకోవడం గురించి వారు ప్రయత్నించారు. నిజానికి, ఇప్పుడు కేంద్రం కూడా అదే ఆలోచనతో అనుమతులు ఇచ్చింది. సినిమా రంగం ప్రభుత్వానికి చాలా పెద్ద ఆదాయ వనరు కాబట్టి.. ఆ రంగం స్తంభించిపోతే ఆదాయం ఆగుతుంది కాబట్టి… అనుమతులు ఇస్తున్నట్టుగా ప్రకాష్ జవదేకర్ స్వయంగా ప్రకటించారు. నిన్న వాళ్లు అనుమతులు అడిగినా.. ఇవాళ కేంద్రం అనుమతులు ఇచ్చినా.. రెండు విధాలుగానూ ‘లాభం’ మాత్రమే కనిపిస్తోంది. 

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో షూటింగుల పునఃప్రారంభం గురించి చర్చలు జరుపుతున్న చిరంజీవి, నాగార్జున (ఫైల్)

కొన్ని రంగాలు పనిచేయకపోతే వ్యవస్థ స్తంభిస్తుంది. కొన్నింటి ఉత్పాదకత ఆగిపోతే సమాజం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. అలాంటి రంగాలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని అయినా.. కొవిడ్ సమయంలో అనుమతులు ఇవ్వడం అవసరం. కొన్ని రంగాలు.. కొన్నేళ్లపాటూ సుషుప్తావస్థలో ఉన్నా.. సమాజం సాధారణ గమనానికి ఇబ్బంది ఉండదు. సినీ రంగం కూడా అలాంటిదే. అలాంటి తార్కికమైన ఆలోచన లేకుండానే.. కేంద్రం షూటింగులకు అనుమతులు ఇచ్చేసిందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. 

ఈ అనుమతులు వచ్చినంత మాత్రాన పెద్ద సినిమాలు మొదలు కాకపోవచ్చునని, యాక్షన్ కట్ చెప్పే ధైర్యం పెద్ద సినిమాలకు ఉండకపోవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్న సినిమాల వారు పనిని పునఃప్రారంభించినా.. ఇన్ని జాగ్రత్తలు, నిబంధనల మధ్య మనగలరా? కొవిడ్ నుంచి సురక్షితంగా ఉండగలరానే అనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి.

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు స్థూలంగా ఇవే :

  • సామాజిక దూరం,కోవిడ్ నిబందనలు పాటిస్తూ చిత్రీకరణలు చేసుకోవాలి.
  • ఫేస్ మాస్కులు, షీల్డులు పని ప్రదేశాలు, షూటింగ్ ప్రదేశాల్లో తప్పనిసరి.
  • వీలైనంత వరకు 6 అడుగుల దూరాన్ని పాటించాలి.
  • తక్కువ సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చర్యలు చేపట్టాలి. 
  • షూటింగ్ ప్రదేశాలకు ప్రేక్షకులను అనుమతించరాదు.
  • స్టూడియోలలో వేర్వేరు యూనిట్లకు వేర్వేరు సమయాలు కేటాయించాలి. రద్దీని నియంత్రించాలి. 
  • ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉండాలి. 
  • పరిశ్రమలో హైరిస్క్ కలిగినవారు మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • సెట్లు, మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్లు, టాయిలెట్లను తరచుగా శానిటైజ్ చేయాలి. 
  • తగినన్ని గ్లౌజులు, మాస్కులు, పీపీఈలు అందుబాటులో ఉంచుకోవాలి. 
  • కేమేరా ముందు నటించేవారు, నటించే సమయంలో మినహా మిగతా అందరూ విధిగా ఫేస్ మాస్కులు, షీల్డులు ధరించాలి.
  • షూటింగ్ వస్త్రాలు, విగ్గులు, మేకప్ మెటీరియల్ ఇతరులతో పంచుకోకుండా నియంత్రించాలి.
  • మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులు పీపీఈ కిట్లు ఉపయోగించాలి.
  • కెమేరాలు, పరికరాలను ఒకరికంటే ఎక్కువ ఉపయోగించే పక్షంలో.. సిబ్బంది కచ్చితంగా గ్లౌజులు ధరించాలి. 
  • లేపల్ మైకులను దూరం పెట్టాలి. లేదా వాటి వాడకం వీలైనంతగా తగ్గించాలి. 

థియేటర్ల వద్ద … 

  • సినిమా థియేటర్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ కాకుండా చర్యలు తీసుకోవాలి. 
  • లోపలికి ప్రవేశించే మార్గాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి. 
  • కోవిడ్-19 జాగ్రత్తలు తెలిపే పోస్టర్లు, సందేశాలు అందుబాటులో ఉంచాలి
  • థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి. 
  • టికెట్ల అమ్మకాల్లో ముట్టుకోవాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్ బుకింగ్స్, ఈ-వాలెట్లు, QR కోడ్ స్కానర్లు వినియోగించాలి. 
  • తరచుగా పని ప్రదేశాలను, కామన్ ఏరియాను శానిటైజ్ చేస్తూ ఉండాలి
Tags: Chiranjeevicine shootingsleotoprajamoulitollywood
Previous Post

అమరావతి పోరాటానికి ఈ ‘గేర్’ చాలదు

Next Post

ధర్మాన : లూప్ లైన్‌కు కారణం ఇదే!

Related Posts

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

Voluptuous Beauty Apsara Rani Will Make You Go Crazy!!!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Lavanya Tripathi

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

ముఖ్య కథనాలు

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist