నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ చిత్రాలు రూపొందడం.. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలవడం తెలిసిందే. ఈసారి వీరిద్దరూ చేసే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడడం సహజం. అందుకనే అంచనాలకు తగ్గట్టుగా ఉండే సినిమా చేయాలని చాలా కష్టపడి.. ఇష్టపడి బోయపాటి పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారు.
అయితే.. ఈ సినిమా సెట్ అయ్యింది. ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దామనుకుంటే.. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సెట్ కాకపోవడంతో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవడం జరిగింది. అయితే.. ఇందులో ఓ ఐటం సాంగ్ ఉందట. స్టార్ హీరోయిన్స్ ఎలాగూ సెట్ కాలేదు కనీసం.. ఈ ఐటం సాంగ్ ను అయినా స్టార్ హీరోయిన్ తో చేయించాలనేది బోయపాటి ప్లాన్.
స్టార్ హీరోయిన్లు ఎవరూ కూడా ఐటం సాంగ్ చేయడానికి రెడీగా లేరట. ఎవర్ని అడిగినా నో చెప్పేస్తున్నారట. ప్రస్తుతం బోయపాటి ఐటం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారని తెలిసింది. మే 28న ఈ సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అందుచేత ఏప్రిల్ ఎండింగ్ కి షూటింగ్ పూర్తి చేయాలి కానీ.. ఐటం సాంగ్ విషయంలో క్లారిటీ రాలేదని టెన్షన్ పడుతున్నారట. టాలీవుడ్ లో ఎవరూ సెట్ కాకపోతే బాలీవుడ్ నుంచైనా హీరోయిన్ తీసుకోవాలనేది బోయపాటి ప్లాన్. మరి.. బాలయ్యతో ఐటం సాంగ్ చేసే హీరోయిన్ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.











