మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుంటే.. చరణ్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఇటీవల రామ్ చరణ్ ఆచార్య షూట్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో పూజా హేగ్డే జిల్ జిల్ జిగేలు రాణి అంటూ ఐటం సాంగ్ లో నటించింది.
ఇప్పుడు ఆచార్య సినిమాలో జంటగా నటించనున్నారు. చరణ్ గెస్ట్ రోల్ అనుకున్నప్పటికీ.. ఆతర్వాత పాత్ర నిడివి బాగా పెంచారు. ఫుల్ లెంగ్త్ రోల్ గా మార్చేశారు. ఇక పూజా హేగ్డే రోల్ విషయానికి వస్తే.. చరణ్ ని ప్రేమించే అమ్మాయిగా కనిపించే పూజా ఈ మూవీలో 15 నిమిషాల పాటు కనిపించనుందని తెలిసింది. నెక్ట్స్ షెడ్యూల్ లో పూజా జాయిన్ కానుంది. చరణ్, పూజాలపై రొమాంటిక్ సాంగ్ ను కూడా చిత్రీకరించనున్నారు.
మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మరిన్ని అంచనాలు పెరిగాయని చెప్పచ్చు. తండ్రీ కొడుకులు చిరు – చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య పై అంచనాలు రోజురోజుకు అధికమౌతున్నాయి. మరి.. మే 13న రానున్న ఆచార్య ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
Must Read ;- మణిశర్మ మాయాజాలంగా శాకుంతలం











