తొలి సినిమా ఉప్పెన విడుదల కాకుండానే.. మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసింది కృతిశెట్టి. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి సైతం.. కృతి శెట్టి చాలా బాగా నటించింది. మరో స్టార్ హీరోయిన్.. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వెంటనే తమ సినిమాల్లో వెంటనే బుక్ చేసుకోండి లేకపోతే ఆమె డేట్స దొరకవు అంటూ ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేట్ మెంట్ ఇచ్చేయడంతో ఆమెకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.
తాజా వార్త ఏంటంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించనున్నారు. అయితే.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట.
మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలి అనుకుంటున్నారట త్రివిక్రమ్. ఇక సెకండ్ హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వరుసగా ఆపర్స్ వస్తున్న ఈ టైమ్ లో సెకండ్ హీరోయిన్ గా చేస్తుందా అనే అనుమానం ఉన్నప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన, దీనికి త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో ఆమె ఓకే చెప్పే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ మూవీలో నటించే ఛాన్స్ వస్తే.. కృతికి బంపర్ ఆఫరే.











