ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశం జనం మొత్తాన్ని అడిగినా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో జగన్ కుట్ర ఉందని వందకు వంద శాతం చెబుతారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక రాజకీయ కక్ష లేదని జగన్ బ్యాచ్ చెబుతున్నప్పటికీ అసలు వాస్తవమేమిటో అందరికీ తెలుసు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో జగన్‌ను తప్పుబట్టని వారు ఉండరు. మొత్తంగా చంద్రబాబును అరెస్ట్ చేయించిన పాపం జగన్ మెడకు చుట్టుకుంది. వైసీపీని ఛీత్కరించే జనం పెరిగిపోయారు.
చంద్రబాబు అరెస్టయి నెల రోజులు దాటుతోంది. ఈ నెల రోజుల్లో తెలుగుదేశం పార్టీ కేడర్ రకరకాల కార్యక్రమాల ద్వారా చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనతెలిపింది. ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజానీకం ఈ నిరసనలో పాల్గొన్నారు. చంద్రబాబు కుటుంబానికి మద్దతు తెలిపారు. .జగన్ పాలనలో తమకుటుంబానికి ముఖ్యంగా చంద్రబాబుకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసనల రూపంలో ప్రజలంతా బలంగా వినిపించారు.
ఈ పరిణామాల నడుమ గత వారం ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం జగన్ కొత్త డ్రామా మొదలు పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో అసలేం జరిగిందని ఢిల్లీ పెద్దలు అడిగిన ప్రశ్నలకు నోరెళ్ల బెట్టిన జగన్ ఆ తర్వాత మాట మార్చారు. అసలు ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని, చంద్రబాబు అరెస్ట్ సమయంలో తాను ఇండియాలోనే లేనని, లండన్‌లో ఉన్నానని బీజేపీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో తన తప్పేమీ లేదని తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన జగన్ ఆ నోటా ఈ నోటా వినిపిస్తోన్న మాటలను పోగేసి తప్పంతా బీజేపీదే అనేశారు. జగన్ నుంచి ఈ మాట వస్తుందని ముందే ఊహించిన బీజేపీ హైకమాండ్ నానా చివాట్లు పెట్టిన సంగతి ఏపీ అంతటా కోడై కూస్తోంది. అసలు చంద్రబాబును అర్థరాత్రి అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని, ఇంత కీలకమైన సమయంలో కేసులెందుకు గుర్తుకొచ్చాయని బీజేపీ అడిగిన ప్రశ్నలకు జగన్ నుంచి ఎలాంటి సమాధానం లేదు.
లండన్ నుంచి తిరిగొచ్చాక చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకీ పెరుగుతున్న సానుభూతిని చూశాక జగన్ డైలమాలో పడ్డారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికలకుముందు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని,జనంలో తన పట్ల ఇంత వ్యతిరేకత ఉందన్న విషయం అర్థం చేసుకున్న జగన్‌లో ఇప్పటి వరకూ ఉన్న ఎన్నికల భయం బలపడింది.ఈ కారణంగానే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో తన తప్పేమీ లేదని ఢిల్లీ పెద్దలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
అయితే ఢిల్లీ పెద్దలతో పెట్టుకుంటే ఏమవుతుందో ఈ పాటికి జగన్‌కు చాలా సార్లు అనుభవమైంది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో మరో సారి వ్యూహం దెబ్బ తినటం ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి అనుకోని పరిణామాలు ఎదురవడంతో జగన్‌లో భయం పెరిగిపోయింది. సొంత పార్టీ నివేదికలు కూడా జగన్‌కు ఎంత నష్టం జరిగిందో సవివరంగా చెప్పేయడం, ఒపీనియన్ పోల్స్‌లో సైతం జనం ఛీ కొట్టడంతో ఎన్ని వ్యూహాలు పన్నినా.. జగన్‌ను వెంటాడుతున్న భయం మాత్రం స్పష్టమవుతోంది.
వాళ్లను తొక్కేశాడు.. నాశనం అయ్యాడు… జగన్‌పై ఏబీవీ సంచలన కామెంట్స్…!!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కళ్లు...