నేటి ఉరుకుల పరుగుల జీవితంలో యువత తమ వ్యక్తిగత జీవితాలను మర్చిపోయి మరి పని చేయడంతో ఆ దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గింది. దీంతో తలలు పట్టుకున్న ఆ దేశ అధికారులు ఓ వినూత్న ఆలోచనను ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. ఇంతకు ఆ దేశం ఏంటో.. ఆ కథాకమామిషు ఏంటో తెలుసుకుందామా?
జపాన్ ప్రజలు తమ ఆర్థిక స్థితిగతులను పెంచుకొనేందుకు 24 గంటలు పని చేయమన్న చేస్తారు. ఎక్కువ శాతం ప్రజలు తమ ఆదాయం మరింత మెరుగు పడిన తరువాత పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో చాలా కాలం పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటున్నారు. ఫలితంగా దేశంలో జననాల రేటు పడిపోయింది.
దేశంలో జననాల రేటు పెరగాలంటే ముందుగా యువతీయువకులు పెళ్లి చేసుకునేలా ప్రోత్సాహించాలని భావించిన జపాన్.. పెళ్లి చేసుకునే జంటలకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకు గానూ ప్రభుత్వం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల యెన్ లు ( అంటే సుమారు 4 లక్షల కు పైగా) నగదు ఇస్తామని వెల్లడించింది.
అయితే పథకం ప్రారంభించడంతో పాటు కొన్ని నిబంధనలను కూడా విధించింది. ముందుగా వరుడు, వధువు తమ పేర్లను రిజిస్టార్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారి వార్షికదాయం 5.4 లక్షలకు మించకుండా ఉండాలి. పెళ్లి జంట ఇరువురి వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలన్న నిబంధనలను ఉంచేసింది.
మరి ఈ నిబంధనలన్నింటికి అంగీకరించి ఎన్ని జంటలు ముందుకు వచ్చి పెళ్లి చేసుకుని, ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ను ఉపయోగించుకుంటాయో చూడాలి.











