వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డికి సంబంధించిన ఓ వ్యవహారం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా… తన మొబైల్ ఫోన్ పోయిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. స్యయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది జరిగిన సందర్భం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అరబిందో ఫార్మా డైైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయ్యారు కదా. సరిగ్గా ఆ సమయంలోనే తన ఫోన్ పోయిందంటూ సాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరత్ చంద్రారెడ్డి… సాయిరెడ్డి కూతురు భర్తకు స్వయానా సోదరడు.
అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ అండగా కాకినాడ పోర్టు సహా, కాకినాడసెజ్ లను బలవంతంగా లాగేసుకున్న వ్యక్తిగా శరత్ చంద్రారెడ్డిపైై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ పోర్టు లాక్కునే కార్యక్రమానికి స్వయంగా సాయిరెడ్డే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టుకు సంబంధించి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్దితో మాట్లాడుకోవాలని, ఆ సమయంలో శరత్ చంద్రారెడ్డి కూడా అక్కడే ఉంటారని కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుకు సాయిరెడ్డే ఫోన్ చేసి చెప్పారు.
సరే… అదంతా పక్కనపెడితే… శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన మరుక్షణమే తన ఫోన్ పోయందని సాయిరెడ్డి చెప్పిన మాట పూర్తిగా అబద్ధమట. తన ఫోన్ పోయిందన తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని సాయిరెడ్డి చెప్పిన మాటలో అసలు నిజమే లేదట. ఈ మేరకు సాయిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా… దానిపై కేసు నమోదు చేసినట్టుగా ఎక్కడా ఆధారమే లేదట. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, తాము కేసు నమోదు చేయలేదని పోలీసులు తాజాగా తేల్చి పారేాశారు. టీడీపీకి చెందిన ఓ నేత సమాచార హక్కు చట్టం కింద ఈ విషయంపై వివరణ కోరగా… పోలీసు శాఖ నుంచి సదరు సమాచారం వచ్చిందట. మరి సాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే… తన ఫోన్ పోయిందని, దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎలా చెప్పారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
అంతేకాకుండా తన ఫోన్ పోకున్నా… పోయిందని సాయిరెడ్డి నాటకాలాడాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దిశగానూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ఈ విషయాన్ని సరిగ్గా శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన సందర్భంలోనే సాయిరెడ్డి ఎందుకు ప్రస్తావించారన్నది మరంత అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాయిరెడ్డికి ఏమైనా పాత్ర ఉందా? అన్న దిశగా ఈ అనుమానాలు బలపడతున్నాయి.
ఇక ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉండగా… సాయిరెడ్డి వద్ద ఓ జర్నలిస్టు పీఏగా పనిచేశారట. పార్టీ అధికారం కోల్పోగానే…సదరు జర్నలిస్టును ఉద్యోగం నుంచి తొలగించగా… ఆయన ఓ న్యూస్ ఛానెల్ లో ఉద్యోగంలో చేరారట. సదరు ఛానెల్ తో సాయిరెడ్డి నిత్యం వాదులాటకు దిగుతూ ఉన్న నేపథ్యంలో ఆ జర్నలిస్టు ఈ విషయాన్ని తన మిత్ర బృందం వద్ద బయటపెట్టారట. సాయిరెడ్డి ఫోన్ పోయిందని నాడు తన ద్వారానే పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లుగా సదరు జర్నలిస్టు చెప్పారట.
ఈ లెక్కన సాయిరెడ్డి ఫోన్ పోయిందన్న వ్యవహారం పూర్తిగా సదరు జర్నలిస్టుకు తెలిసే ఉంటుంది. ఇదే విషయాన్ని ఆయన బహిరంగం చేస్తే సాయిరెడ్డికి చిక్కులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన అక్రమ వ్యవహారాలన్నీ కూడా సాయిరెడ్డి ఫోన్ లో ఉండి ఉంటాయని, ఈ కారణంగానే సరిగ్గా శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన సమయంలోనే సాయిరెడ్డి తన ఫోన్ పోయందని జర్నలిస్టుతో ఫిర్యాదు చేయించి ఉంటారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపైై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన టీడీపీ నేత మరింత లోతుగా పరిశీలనకు దిగితే… సాయిరెడ్డి అడ్డంగా బుక్కైనట్టేనని చెప్పక తప్పదు.











