పవర్ స్టార్ కమ్ బ్యాక్ మూవీ అయిన వకీల్ సాబ్ .. ఏ రేంజ్లో హిట్టైందో తెలిసిందే. ఈ నెల 9న విడుదలైన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. సినిమా చూసిన సినీ ప్రముఖులు ఈ సినిమా కథాంశానికి, పవన్ కళ్యాణ్ నటనకి ఫిదా అయిపోయారు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. దాదాపు రూ. 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి.. పవన్ కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది.
మహిళల పట్ల సమాజంలో జరుగుతున్న వివక్ష, వారి ఆత్మాభిమానానికి ఖరీదు గట్టే ఈ సమాజానికి చెంపపెట్టుగా ఈ సినిమా నిలవడంతో .. వీక్షించడానికి మహిళా ప్రేక్షకులు సైతం క్యూ కట్టారు. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో వకీల్ సాబ్ మేకర్స్ .. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ‘వకీల్ సా’బ్ సినిమాకి సంబంధించిన మరో ప్రత్యేక విశేషమేంటంటే.. ఈ సినిమాను రీసెంట్ గా చూసిన సుప్రీమ్ కోర్ట్ మాజీ న్యాయమూర్తి.. జస్టిస్ వి. గోపాల గౌడ ప్రశంసల జల్లులు కురిపించారు. ఇన్నాళ్ళకు ‘వకీల్ సాబ్’ రూపంలో ప్రపంచ వ్యాప్తంగా మధ్యతరగతి మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలపై న్యాయ పోరాటం ఒక సినిమాగా వచ్చింది. మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన ఒక యోధుడిగా.. పవన్ కళ్యాణ్ నటన అత్యద్భుతం.. ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ దేశంలో అగ్ర నటులే కాకుండా.. ప్రపంచ స్థాయి నటుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ అరుదైన గౌరవం పవన్ కళ్యాణ్ కే దక్కడం విశేషం అంటూ.. ఆయన కితాబునిచ్చారు. ప్రస్తుతం ఆయన అప్రిసియేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- వకీల్ సాబ్ పై ఆర్జీవీ సాబ్.. ట్వీట్లా అవి.. తిట్లా?