విలువైన భూములపై భూబకాసురులు కన్ను!
చిత్తూరు జిల్లాలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా భూ మాఫియా కోరలు చాచుతోంది. ఖాళీగా ఉన్న జాగాలో పాగావేసి.. నిబంధనలకు విరుద్ధంగా రెవిన్యూ శాఖ ద్వారా నకిలీ డాక్యుమెంట్స్ పొందుతున్నారు. దీంతో జిల్లాలో మాఫియా లీగల్ అయ్యింది. ఇటీవల ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు చెందిన స్థలం నారావారిపల్లెలో కబ్జాకు గురైంది. ఈ కబ్జా ఉద్దాంతం బయటకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. సాక్ష్యాత్తు మాజీ ముఖ్యమంత్రి స్థలలు, ఆస్తులే కబ్జాకు గురైతే దిక్కులేదు.. సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏ పాటిదో దీంతో ఏపీలో ఒక క్లారిటీ వచ్చింది. తాజాగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం కేంద్రంలోని దక్షిణ కైలాస్ నగర్ ఆనుకుని తొట్టంబేడు మండలం సీఎన్ఆర్ కండ్రిగ రెవెన్యూ గ్రామంలోని విలువైన భూములపై అధికారపార్టీ బడా బాబుల కన్ను పడింది. ఈ ప్రాంతంలో ప్రధాన రహదారికి అనుకుని ఎకరా రూ. 10 కోట్లు పలుకుతుండగా .. లోపలి వైపు ఎకరా రూ. 5 కోట్లు పలుకుతోంది. సర్వే నెంబర్ 52 లో 2.58 ఎకరాలు, సర్వే నెంబర్ 53 లో 1.44 ఎకరాలు కాలువ పొరంబోకు భూమిని రెవిన్యూ రికార్డుల్లో పట్టాభూమిగా మార్చినట్లు తొట్టెంబేడు తహసీల్దార్ పరమేశ్వరస్వామిపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ భూమిని గంగలపూడి సుకేష్, ఎస్కే హమీద్ బాషా, వై. ప్రసాద్ పేరిట ఆన్ లైన్ లోనూ నమోదు చేశారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో తీగలాగితే డొంక కదిలింది!
స్వామి భక్తిని చాటుకున్నాడు.. చివరికి సస్పెండ్ అయ్యాడు!
చిత్తూరు జిల్లా తొట్టంబేడు తహసీల్దార్ పరమేశ్వరస్వామి గతంలో కడప జిల్లా సుండుపల్లె మండలంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో పదోన్నతి పొంది, అదే ఏడాది జులై నుంచి తొట్టంబేడులో తహసీల్లార్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కడప జిల్లా, చిత్తూరు జిల్లాల అధికారపార్టీ నేతలతో ఉన్న సంబంధాలతో విధులు మరిచి, ఉద్యోగాన్ని పణంగా పెట్టిమరి గ్రీన్ ఇంకును అడ్డగోలుగా వాడారు. దీంతో జిల్లా కలెకర్ట్ హరినారాయణ్ ఆగ్రహించారు. పరమేశ్వర స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరికొంతమంది సిబ్బందిపై విచారణ జరిపి..చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని క్లాసిఫికేషన్ మార్చేసి పలువురు వ్యక్తుల పేరిట ఆన్ లైన్ లో నమోదు చేసినట్లు గుర్తించామని ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి వివరించారు. రెవిన్యూ రికార్డ్స్ లో గంగలపూడి సుకేష్, ఎస్కే హమీద్ బాషా, వై.ప్రసాద్ పేరిట ఈ భూమిని బదాలయించినట్లు చెప్పుకొస్తున్న ఈ మూడు పేర్లు డమ్మిలని, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన వైసీపీ బడా నేత ఒకరు తెరమాటున ఉండి ఈ భూదందాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా మొత్తంగా అధికారపార్టీ నేతల తెంపరితనం, భూ మాఫియాకు తహసీల్దార్ తో పాటు రెవిన్యూ అధికారులు బలయ్యారు.
Must Read:-సిక్కోలు వైసీపీ ఉన్మాదంపై చంద్రబాబు ఫైర్! కోన వెంకట్రావుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే?