దర్శక ధీరుడు రాజమౌళి రీసెంట్ గా తన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదల చేసి మళ్ళీ వార్తల్లో నిలిచాడు. దాదాపు రూ. 450 కోట్లు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ తో తొలిసారిగా ఈ సినిమా ప్రచారం మొదలైంది. ఇప్పుడు రెండో టీజర్ తో ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కు చేరాయి.
రాజమౌళి తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక అంశంతో ఆసక్తిని, ఆత్రుతను కలగజేసి ప్రేక్షకులకు ఒక పజిల్ లా వదిలిపెడతాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విషయంలో ఓ రెండు పాయింట్స్ ఇప్పుడు అందరినీ నిద్రపట్టనీయకుండా చేస్తున్నాయి. ఈ సినిమాలో చెర్రీ సీతారామరాజుగానూ, యన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్ని పోషిస్తున్న సంగతి తెలిసిందే. 1920 లో స్వతంత్ర్యానికి పూర్వం ఆ ఇద్దరూ కొద్ది రోజులు ఎవరికీ కనిపించకుండా కనుమరుగైపోతారు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఏం చేశారు అనేదే జక్కన్న ఫిక్షనల్ స్టోరీ. ఈ సినిమా ఓపెనింగ్ రోజునే రాజమౌళి ఆ పాయింట్ ను రివీల్ చేసేశాడు.
అయితే రెండు వేరు వేరు సందర్భాల్లో విడుదలైన రెండు టీజర్స్ లోనూ.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కేరక్టర్స్ తో పాటు మరో రెండు పాత్రల్ని కూడా మనం చూశాం. చెర్రీ పోషించిన రామరాజు టీజర్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ తో పాటు బాక్సర్ పాత్ర కూడా కనిపిస్తుంది. అలాగే.. తారక్ కు సంబంధించిన టీజర్ లో కొమరం భీమ్ పాత్రతో పాటు ఓ ముస్లీమ్ యువకుడి పాత్ర కూడా రివీలైంది. ఈ రెండు అంశాల్లోనూ ప్రేక్షకులు పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాంతో సీతారాజు, కొమరం భీమ్ పాత్రల తీరుతెన్నులు జనానికి అంతుబట్టడంలేదు.
తాజా సమాచారం ప్రకారం.. ఆర్.ఆర్.ఆర్ సినిమా కథ .. రెండు టైమ్ లైన్స్ లో ట్రావెల్ అవుతుందట. నిజానికి ఈ థీమ్ ను రాజమౌళి ‘మోటార్ సైకిల్ డైరీస్’ అనే హాలీవుడ్ మూవీ నుంచి తీసుకున్నాడని టాక్. దాని ప్రకారం. ఈ సినిమాలో తారక్ , రామ్ చరణ్ లు డ్యూయల్ రోల్స్ చేస్తున్నారనే వార్తలు వినిస్తున్నాయి. చెర్రీ ఇటు అల్లూరి సీతారామరాజు పాత్రను, అటు బాక్సర్ పాత్రను పోషిస్తుండగా.. తారక్ కొమరం భీమ్, ఒక ముస్లీమ్ గిరిజన యువకుడిగా పాత్రను చేస్తున్నాడని తెలుస్తోంది. అందుకే రామరాజు ఫర్ భీమ్ టీజర్ లో యన్టీఆర్ ముస్లీమ్ యువకుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు. అదే కానీ నిజమైతే.. తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పండగే. మరి నిజంగానే తారక్, చెర్రీలు డ్యూయల్ రోల్స్ చేస్తారేమో చూడాలి.











