కేజీఎఫ్ 2 రికార్డును కాంతార బద్దలు కొట్టింది. ఈ సినిమా విడుదలై 50 రోజులైనా దీని హవా తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ ను దాటేసింది. కర్ణాటకలో కేజీఎఫ్ 2 రికార్డును అధిగమించి 168.50 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్లు, తమిళనాడులో 12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు, ఓవర్సీస్ లో 44.50 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆల్ టైమ్ రికార్డు సొంతమైంది. ఇప్పటికీ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది.
విడుదలై 50 రోజులు దాటినా బాక్సాఫీస్ కలెక్షన్లు పెరగడం చెప్పుకోవాల్సిన అంశం. ఇప్పటివరకు కేజీఎఫ్ 2 మూవీ రూ.155 కోట్లతో టాప్ లిస్టులో ఉంది. ఇప్పుడు కాంతార ఆ రికార్డును బ్రేక్ చేసింది. సినిమా రిలీజై 50 రోజులు దాటినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 1000కిపైగా స్క్రీన్లలో ఆడుతోంది. ఇండియాలోనే 900కుపైగా స్క్రీన్లలో కాంతార ఇంకా ఆడుతోంది. ఈ మధ్యే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఈ నెల 24న తమ ఓటీటీలో కూడా ఈ సినిమాని చూడవచ్చు.











