లుంగీలతో మైత్రీ మూవీస్ హీరోలు చెడుగుడు ఆడేయబోతున్నారు. ఇంకెవరు బాల.. చిరు.. ఈ సంక్రాంతి పుంజులుగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. విశేషమేమిటంటే బాలయ్య సినిమాకి ఆయన అభిమాని మలినేని గోపీచంద్ దర్శకుడైతే, చిరు సినిమాకి ఆయన అభిమాని బాబి కొల్లి దర్శకుడు. ఈ రెండింటిలోనూ శృతిహాసనే హీరోయిన్ కావడం ఒక విశేషం. సంగీత దర్శకులుగా తమన్, దేవిశ్రీ ప్రసాద్ పోటీ పడుతున్నారు. వీరి సినిమాల్లోని తొలి పాటల విడుదలకు రంగం సిద్దమైంది. వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ ప్రోమో కూడా విడుదలైంది. నువ్వు లుంగీ ఎత్తుకో.. నువ్వు షర్ట్ ముడేసుకో, నువ్వు ఖర్చీఫ్ కట్టుకో బాస్ వస్తుండు అనే పల్లవితో చిరు పాట ఉంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ రాయడం ఇంకో విశేషం. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
ఈ పాటను బుధవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. ఇది ఊర మాస్ సాంగ్ అని అర్థమవుతోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాతో కలిసి మెగాస్టార్ డ్యాన్సులు వేయబోతున్నారు. జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదలకాబోతోంది. ఇక బాలయ్య సినిమాలోని పాట ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి. ఇందులో కూడా చిరుకు ధీటుగాపూ బాలయ్య తొడగొట్టి దుమ్మురేపనున్నారు. బహుశా పాట పల్లవి కూడా ఇదేనేమో. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఈసారి సంక్రాంతికి క్రేజీ ప్రాజెక్టులుగా ఉన్నాయి. ఒకే నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు పోటీ పడటం ఈ సంక్రాంతి విశేషం.