ఓటీటీలో కొత్త సినిమాల కోసం మొహం వాచిపోయిన వారు మళ్లీ పండగ చేసుకోవచ్చు. కాంతార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మరో మూడు రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. గత వారం ‘ధారవి బ్యాంక్’, ‘గాడ్ ఫాదర్’, ‘సర్దార్’, ‘హాస్టల్ డేజ్ సీజన్-3’ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ల ఓటీటీ ప్రేక్షకులను అలరించాయి. తాజా మరో కొన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ లో ప్రసారం కానున్నాయి. ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతార సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా ఈ నెల 24 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. నటుడిగా రిషబ్ శెట్టి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రమిది. ఇప్పటికే థియేటర్లలో భారీ వసూళ్లు సాధించినా ఓటీటీ ప్రసారం మీద కూడా క్రేజ్ ఏర్పడింది. అలాగే దీంతో పాటు ఖాకీ – ది బీహార్ చాప్టర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నీరజ్ పాండే క్రైమ్ యాక్షన్ డ్రామా సిరీస్ ఇది. ఓ సూపర్ కాప్ కీ, ఓ కరుడు కట్టిన నేరగాడికీ మధ్య సాగే కథతో దీన్ని రూపొందించారు. ఇందులో ఇంకా కరణ్ ఠాకర్, అవినాష్ తివారీ, అభిమన్యు సింగ్, రవి కిషన్, అశుతోష్ రాణా, అనూప్ సోనీ నటించారు.
ఈ నెల 25 నుంచి ఇది ప్రసారమవుతుంది. సైకలాజికల్ రొమాన్స్ థ్రిల్లర్ చిత్రం చుప్ ఈ నెల 25 నుంచి జీ5లో ప్రసారమవుతుంది. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయ ధన్వంతరి, పూజా భట్ కీలక పాత్రలు పోషించారు. బాలికల హాస్టల్ సీజన్-3 కూడా ఈ నెల 25 నుంచి సోని లివ్ లో ప్రసారం కానుంది. ఇది కామెడీ డ్రామా. నలుగురి అమ్మాయిల కథ. వారి జీవితంలోని వ్యక్తిగత కోణాలను ఇందులో ఆవిష్కరించారు. అలాగే పడవెట్టు ఈ నెల 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఉత్తర కేరళలోని అణగారిన ప్రజలపై దృష్టి పెట్టి తీశారు. శివకార్తికేయన్ ప్రిన్స్ ఈ నెల 25 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. సినిమా ప్రియులు ఒక వారం రోజుల పాటు వీటిని వీక్షించి ఎంజాయ్ చేయవచ్చు.











