జులై 1 నుంచి తెలంగాణలో ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రరెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష బోధనకు ప్రస్తుతం తొందరేమీ లేదని కేసీఆర్ అన్నారు. పాఠశాలల్లో 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ఆదేశించారు. జులైలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌ను కలిసిన పీఆర్టీయూ, టీఎస్ నాయకులు
కాగా సీఎం కేసీఆర్‌ను పీఆర్టీయూ, టీఎస్ నాయకులు కలిసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. కరోనా దృష్ట్యా పాఠశాలల పున:ప్రారంభాన్ని తాత్కాలికంగా వేయిదా వేయాలని, ఆన్ లైన్‌లోనే విద్యా బోధన కొనసాగించాలని వారు సీఎంను కోరారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా అనుమతించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలల తరగతులపై, ఉపాధ్యాయుల హాజరై విద్యాశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.











