భాజపా తీర్థం పుచ్చుకున్న కొద్ది గంటల్లోనే ఆ పార్టీలోని నాయకులను భాజపా నాయకురాలు, నటి ఖుష్బు విమర్శించారు. ఇప్పుడు ఆ విమర్శలు కాస్తా దుమారం రేపాయి.
సెక్షన్ 92(ఏ) మానసిక వికలాంగుల చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేయాలంటూ తమిళనాడు వికలాంగ హక్కుల సంరక్షకుల అసోసియేషన్ అధ్యక్షుడు నంబురాజన్ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన భాజపా నాయకురాలు, నటి ఖుష్బు క్షమాపణలు తెలిపారు. మీడియా సమావేశంలో ‘మానసిక వేదన, తొందరపాటులో రెండు ఉపయోగించకూడని పదాలను వాడాను. దీని వలన మీరు బాధపడతారని నేను భావించలేదు. నా మాటల వల్ల మీరు బాధపడినందుకు నన్ను క్షమించాలి’ అంటూ ఆమె కోరారు.
నేను చాలా సున్నిత మనస్కురాలిని కొందరు కాంగ్రెస్ నాయకులు నన్ను మానసిక వేధనకు గురి చేయడం వలనే నేను అలాంటి మాటలను ఉపయోగించవలసి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. మరోసారి ఇటువంటిది జరగకుండా చూసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. కొందరు నాయకులు తనను కావాలనే రెచ్చగొట్టి ఇటువంటి పదాలు ఉపయోగించేలా చేస్తున్నారని ఆమె అన్నారు.
అసలేం జరిగింది…
నటి ఖుష్బు కాంగ్రెస్ పార్టీని విడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె చెన్నై చేరుకోగానే జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘కాంగ్రెస్ లో ఉన్న నాయకులు మానసిక వికలాంగులు, వారికి నాలాంటి తెలివైన మహిళల సేవలను వినియోగించుకోవడం తెలియదు. అందులో ఉన్న నాయకులకు బుర్ర కూడా తక్కువే… నాకు బుర్ర ఉంది కాబట్టే నేను త్వరగా మేలుకొని ఆ పార్టీని వీడి బయటకు వచ్చాను’అంటూ ప్రస్తావించారు.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











