ప్రముఖ హీరోయిన్ , ప్రముఖ తమిళ హీరో సూర్య భార్య జ్యోతిక, మహేష్ బాబు తల్లి గా నటించబోతున్నారని టాక్ . పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ‘సర్కార్ వారి పాట’ లో జ్యోతిక పాత్ర అందరినీ మెప్పిస్తుందని చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్-14 రీల్స్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సాధారణంగా పాపులర్ హీరోయిన్స్ ని తల్లి , అత్త పాత్రల్లో నటింపజేయడం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ . అత్తారింటికి దారేది లో నదియా , అజ్ఞాతవాసి లో ఖుష్బూ , ఆల వైకుంఠ పురంలో టబు ఇలాగే నటించారు .
ఇప్పుడు ఆ స్టైల్ ని పరశురామ్ ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. మహేష్ బాబు సినిమాలు ‘నిజం’ లో తాళ్లూరి రామేశ్వరి పాత్రలా, ‘అర్జున్’ సినిమాలో కమలా కృష్ణ మూర్తి పాత్ర లా జ్యోతిక పోషించే పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. డైనమిక్ సింగల్ మదర్ పాత్ర జ్యోతిక చేస్తున్నారని సమాచారం. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ జనవరి2 నుంచి అమెరికాలో మొదలు అవుతుంది. ఈ సినిమా అధిక శాతం షూటింగ్ అమెరికాలో, గోవా లో, వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు.