ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గినా, వీఐపీలను మాత్రం వెంటాడుతూనే ఉంది. తాజాగా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయింది. కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన నిన్న కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందనవద్దని ఎంపీ కోరారు. పది రోజుల నుంచి వివిధ పనులపై తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన తెలిపారు.
Also Read: ప్రకాశం వైసీపీలో అసంతృప్తి గళాల అసలు కథేంటి?











