రెండు సార్లు ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకున్న జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరువాత అత్యధిక సార్లు ట్రోపిని గెలుచుకున్న జట్టుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. గౌతమ్ గంబీర్, జాక్వస్ కలీస్, షకిబుల్ హుస్సేన్ సేవలు కోల్పోవడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ బలహీనంగా తయారయింది. దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన చేస్తోంది. తాజా సీజన్ లో కూడా జట్టు ఆటగాళ్లు సత్తామేరకు రాణించకపోవడంతో అభిమానులు నిరాశకు గురైయ్యారు.
బౌలింగ్ లో విఫలం
ఐసీసీ బెస్ట్ బౌలర్ గా అవార్డు సొంతం చేసుకున్న కమ్మిన్స్ ను కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ రేట్ ఇచ్చి సొంతం చేసుకుంది. కానీ కమ్మిన్స్ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అద్భుత ప్రదర్శన నమోదు కాలేదు. ‘మిస్టరీ’ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న సునీల్ నరైన్ ఈ సీజన్ లో రాణించకపోవడం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. విజయ్ చక్రవర్తి, నాగర్ కోటి, శివమ్ మావిలకు అనుభవం లేకపోవడంతో ఇంటర్నేషనల్ ఆటగాళ్ల ముందు తేలిపోతున్నారు. ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రస్సెల్ కూడా రాణించకపోవడంతో బౌలింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకుంటోంది.
బ్యాటింగ్ ఆర్డర్ మార్చవలిసిందే
భారీ స్కోరు ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోతున్నారు. ఓపెనర్ గా వస్తున్న సునీల్ నరైన్ నాలుగు మ్యాచ్ లోనూ విఫఫలమయ్యారు. నితీష్ రాణా, శుభమాన్ గిల్ రాణించినా మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో ఆ జట్టు పరాజయం పాలవుతుంది. రస్సెల్ నుంచి ఇప్పటి వరకు భారీ స్కోరు నమోదు కాకపోవడం కూడా ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా కనబడుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న మోర్గాన్ ను ఆలస్యంగా పంపడం కూడా ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుంది. ఇప్పటికైనా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయకపోతే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్ లో ఆశలు వదులుకోవలసిందే!!











