కెప్టెన్ మారినా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అదృష్టరేఖ మారలేదు. కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సులువుగా గెలవవలసిన మ్యాచ్ లో ఓటమి కొనితెచ్చుకుంది. టాస్ గెలవడంలో మాత్రమే విజయవంతమైన రాహుల్ మ్యాచ్ మొత్తం నిర్ణయాలు తీసుకోవడంలో తడబడ్డాడు. ముందుగా ఢిల్లీ జట్టును రాహుల్ బ్యాటింగ్ కు ఆహ్వనించాడు. తమ పేసర్లు అద్భుత బౌలింగ్ చేయడంతో ఢిల్లీ కనీసం 100 పరుగులు చేస్తుందా? అనే అనుమానం కలిగింది. కానీ రిషబ్ పంత్ తో కలిసి శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో నాలుగో వికెట్ కు వీరిద్దరూ 73 పరుగులు జోడించారు. కృష్ణప్ప గౌతమ్-రవి బిష్ణోయ్ లాంటి వారి చేత బౌలింగ్ చేయించారు. వారు అద్భుతంగా బౌలింగ్ చేసి తమ కోటాని ముగించారు. ఇక్కడే రాహుల్ సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు.
స్టోయినిస్ లాంటి నిఖార్సయిన ఆల్ రౌండర్ క్రీజులో ఉన్న సమయంలో ‘ఛేజ్ బౌలర్’ లేకపోవడం పంజాబ్ విజయ అవకాశాలను చావు దెబ్బ కొట్టింది. జట్టు స్ట్రైక్ బౌలర్ షమీ కోటాను కూడా 15 ఓవర్లలోనే ఎండ్ చేశాడు. ఈ నిర్ణయంతో చివరి స్లాగ్ ఓవర్లను కార్టెల్, జోర్డాన్ వేయవలసి వచ్చింది. ఇంగ్లాండ్ సిరీస్ లో తన సత్తా చాటిన స్టోయినిస్ అదే ఫామ్ ను కొనసాగిస్తూ విధ్వంసం స్రుష్టించాడు. 17వ ఓవర్ లో 100 పరుగులు దాటిన ఢిల్లీని 158 పరుగులకు చేర్చాడు. షమీ కోటా పూర్తి కాకుంటే 158 పరుగుల భారీ స్కోరు వచ్చేది కాదని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
రాహుల్ తప్పిదాలు
‘యూనివర్సల్’ బాస్ గేల్ ను పక్కనబెట్టి నికోలస్ పురాన్ ను తీసుకోవడం ఎంత పెద్ద తప్పో ఫలితాన్ని చూస్తే అర్ధమవుతోంది. పురన్ మ్యాచులో, సూపర్ ఓవర్ లో డకౌట్ అయ్యాడు. రాణించినా, రాణించకపోయినా గేల్ ఉంటే ప్రత్యర్థి జట్టు మానసికంగా దెబ్బ తీయవచ్చు. గేల్ ను పక్కనబెట్టడం తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్ తో ఓటమి అంచున నిలిచిన పంజాబ్ జట్టును గెలుపు దిశగా నడిపాడు. కానీ దురదృష్టవశాత్తు ఢిల్లీ స్కోరును సమం చేయగలిగింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది.
రెగ్యులర్ ఓపెనర్ తో బాటు ఫామ్ లో ఉన్న మయాంక్ అగర్వాల్ ను కాదని పురన్ తో కలిసి రాహుల్ సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు దిగారు. రాహుల్ రెండో బంతికి అవుట్ కావడం ఆ వెంటనే తన కెప్టెన్ నిర్ణయం తప్పని రుజువు చేస్తూ పురన్ ఆ తరువాతి బంతికే పెవిలియన్ చేరాడు. దీంతో 2 పరుగులకే పంజాబ్ ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యల్ప స్కోరు. ఇలా వరుస తప్పుడు నిర్ణయాలతో పంజాబ్ ఓటమిలో రాహుల్ కీలకపాత్ర పోషించాడు.
రాహుల్ కు పోటీగా అంపైర్
పంజాబ్ జట్టు ఓటమిలో అంపైర్ నితిన్ మీనన్ కూడా కీలక పాత్ర పోషించారు. రాహుల్ వరుస తప్పులతో ప్రభావితమైన అంపైర్ తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం పంజాబ్ ఓటమికి దారితీసింది. విజయానికి చివరి ఓవర్ లో 13 పరుగులు చేయవలసిన దశలో పంజాబ్ జట్టు మొదటి మూడు బంతులకే 12 పరుగులు చేసింది. స్టోయినిస్ వేసిన చివరి ఓవర్ లో మయాంక్ అగర్వాల్ మొదటి బంతికి సిక్స్, రెండో బంతికి రెండు పరుగులు, మూడో బంతికి నాలుగు పరుగులు చేశాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న జోర్డాన్ రెండో పరుగు చేసే క్రమంలో క్రీజులో బ్యాట్ పెట్టలేదని అంపైర్ భావించాడు.
దీంతో అంపైర్ రెండు పరుగులకు బదులుగా కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చారు. ఈ ఒక్క పరుగుతోనే పంజాబ్ జట్టు సూపర్ ఓవర్ ఆడవలసి వచ్చింది. రీప్లేలో చూస్తే జోర్డాన్ క్లియర్ గా క్రీజులో పెట్టినట్లు అర్ధమవుతోంది. దీంతో క్రీడా అభిమానులు అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ‘కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు’గా పంజాబ్ జట్టు ఓటమికి పలు కారణాలంటూ అభిమానులు వాపోతున్నారు.











