దర్శకుడు క్రిష్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను కరోనా మళ్లీ వణికిస్తోంది. మొన్న రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు కరోనా బారిన పడ్డారు. తాజాగా దర్శకుడు క్రిష్ కరోనా బారిన పడినట్టు తెలిసింది. రకుల్ హీరోయిన్ గా ‘కొండపొలం’ షూటింగ్ ఆయన చేశారు. ఆ మధ్య రకుల్ కూడా కరోనా బారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్రిష్ కూడా కరోనా బారిన పడ్డారు.
మరో విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తోనూ క్రిష్ ఓ సినిమా చేస్తున్నారు. క్రిష్ కరోనా బారిన పడినట్లు తెలిసి చాలామంది కలవర పడుతున్నట్లు తెలిసింది. దాంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. దాంతో ఆయన సినిమా షూటింగులన్నీ వాయిదా పడిపోయాయి.