అందం .. ఆకర్షణ ఈ రెండు కూడా, నివేదా పేతురాజ్ ను తీసుకొచ్చి ఆ పక్కనే నిలబెడితే చిన్న బుచ్చుకుంటాయి. గులాబీలు .. గుమ్మడిపూలు ఈ ముద్దుగుమ్మ పేరు వింటేనే కుళ్లుకుంటాయి. నివేదా పేతురాజ్ మంచి పొడగరి .. అందుకు తగిన పర్సనాలిటీ ఆమె సొంతం. మత్తుకళ్లతో .. వాలు చూపులతో ఆమె ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఈ అమ్మాయిని చూసినవాళ్లంతా చీరకట్టులో మరింత బాగుంటుందని అనుకున్నారు. ఆమె అభిమానుల జాబితాలో చేరిపోయారు.
‘మెంటల్ మదిలో’ పెద్దగా ఆడకపోయినా, ‘చిత్రలహరి’ .. ‘బ్రోచేవారేవురా’ సినిమాలు నివేదా పేతురాజ్ కి విజయాలను అందించాయి. అంతేకాకుండా గ్లామర్ పరంగా ఈ సుందరి మంచి మార్కులు కొట్టేసింది. ప్రింటింగ్ ప్రెస్ కన్నా ఫాస్టుగా తన ప్రింట్లు తీసి కుర్రాళ్ల గుండె గోడలపై అంటించేసింది. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపిస్తూ సుశాంత్ జోడీగా ఆమె ఆకట్టుకుంది. ఇటీవలే ‘విరాటపర్వం’ షూటింగును పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ, త్వరలో ‘రెడ్’ సినిమాతో ప్ర్రేక్షకులను పలకరించనుంది.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన ‘రెడ్’ సినిమాలో, ఆయన జోడీగా నివేదా పేతురాజ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందనీ, తనకి మరింత క్రేజ్ తెస్తుందని నివేదా పేతురాజ్ భావిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కోసం తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెబుతోంది. ‘రెడ్’ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోతుందేమో చూడాలి. ఇక తమిళంలోను ఈ సుందరి సినిమాలు రెండు విడుదలకి ముస్తాబవుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాది జోడు గుర్రాలపై జోరు చూపించనుందన్న మాట.