అమరావతి రైతుల కౌలు సమస్య పరిష్కారం అయింది. భూ సమీకరణలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు Rs. 158 కో ట్లు , 2 నెలల పెన్షన్ మొత్తం Rs 9.73 కోట్లు విడుదల చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఒక ప్రకటన లో తెలిపారు. ఆ మొత్తాలు వారి బ్యాంక్ అకౌంట్ ల లో జమ అవుతా యని తెలిపారు.
చెల్లింపు ప్రక్రియ ముందే మొదలైంది
అమరావతి రైతులకు కౌలు మొత్తాలు, పెన్షన్ మొత్తాలు చెల్లించే ప్రక్రియ ముందే మొదలైంది. పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, తన తల్లి మరణించిన నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరంలోనే ఉన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో ఫైల్ తెప్పించుకుని సంతకాలు చేసి పంపారు. గత ఏడాది కూడా కౌలు మొత్తాల చెల్లింపులు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే జరిగాయి.
అయితే ఈ చెల్లింపు ప్రక్రియ జరుగుతూ ఉండగానే.. అమరావతి రైతులు బుధవారం సీఆర్డీయే కార్యాలయం ఎదుట ధర్నాకు ప్రయత్నించడం జరిగింది. ఈ ఆందోళన ప్రభావం కాకపోయినప్పటికీ.. ముందే ప్రక్రియ మొదలైనందువల్ల.. గురువారానికెల్లా ఆ నిధులు విడుదల అయినట్లు మంత్రి బొత్స నుంచి ప్రకటన వచ్చింది. గురువారం మధ్యాహ్నానికెల్లా.. రైతుల అకౌంట్లలో నగదు జమ కావచ్చునని తెలిసింది.











