బయోపిక్‌లు, వాస్తవ సంఘటణల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ పాప్ కార్న్ తిన్నంత ఈజీగా సినిమాలు చేసేస్తుంటాడు. లాక్ డౌన్ లో సినిమా వాళ్లంతా సినిమాలు తీయ్యడం మానేసినా ఆర్జీవీ మాత్రం వరుస పెట్టి సినిమాలు వదలుతూనే ఉన్నాడు. థియేటర్లు మూసేసినా, ఏటిటి అనే కొత్త పద్ధతిని కనిపెట్టి అడల్ట్ రేటెడ్ సినిమాలు, కాంట్రవర్సీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
అయితే రామ్ గోపాల్ వర్మ ఇటీవల పవన్ కళ్యాణ్ మీద తీసిన సినిమా చాలా మందిని హర్ట్ అయ్యేలా చేసింది. పవన్‌కి అటు రాజకీయంగా ఇటు సినిమాల్లో అభిమానులు లక్షల్లో ఉండటంతో రామ్ గోపాల్ వర్మకి కావాల్సినంత పబ్లిసిటీ మాత్రమే కాదు ఇప్పుడు ఏకంగా ఆర్జీవీ మీద బయోపిక్స్ కూడా రెడీ అవుతున్నాయి. పరాన్నజీవి, రామ్ గోపాల్ వర్మ, ఆర్ జీ వీ అంటూ ఇలా వరుస పెట్టి రామ్ గోపాల్ వర్మ జీవితగాధల్ని పవన్ ఫ్యాన్స్, మెగా కాంపౌండ్ పక్షపాత నిర్మాతలు రూపొందిస్తున్నారు.
అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ స్వయంగా తానే తన జీవిత గాధను సినిమాగా రూపొందిస్తాను అని చెప్పడం వెంటనే రాము అనే టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేయడంతో రామ్ స్టోరీని సినిమాగా తీద్దామనుకున్న మిగతా ఫిల్మ్ మేకర్స్ కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయింది. అయితే రాము పై ఇన్ని బయోపిక్స్ రావడం పై ఇండస్ట్రీ పెద్దలకి అసహనాన్ని తెప్పిస్తోందట.
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏమైనా యన్టీరామారావులా గొప్ప నటుడా లేక ఇండస్ట్రీని బాగు పరిచిన సంస్కర్తా అనే మాట కూడా వినిపిస్ఎంతోందిట. ఎన్టీఆర్ పై రెండు భాగాలుగా జీవితచరిత్ర తీస్తే.. వర్మ చరిత్రను మూడు భాగాలుగా తీస్తుండడం కామెడీగా మారుతోంది. నిజానికి తెలుగులో సీనియర్ యన్టీఆర్ తరువాత రాము జీవితం మీదనే ఇన్ని సినిమాలు రావడం గమనార్హం. అయితే సీనియర్ యన్టీఆర్ మీద కూడా రాము సినిమా తీయడం కొసమెరుపు.











