(విశాఖపట్నం లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 14న జరుగనున్న చందనోత్సవంలో భాగంగా చందనం చెక్కలను ముద్దగా చేసే ప్రక్రియను గత నాలుగు రోజులుగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం చందనం చెక్కలను అరగదీస్తూ ఉండగా చందనం ముద్దల్లో నరసింహస్వామి రూపం దర్శనమిచ్చింది.చందనం అరగదీసి పక్కనపెట్టినప్పుడు..ఆ ముద్దలు సింహం రూపంలో కనిపించడం ఆ శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి మహిమే అంటున్నారు ఆలయ అర్చకులు.ఇలాంటి ఎన్నో మహిమలు స్వామివారు చూపిస్తుంటారని చెప్పారు. చందనోత్సవం – స్వామివారి నిజరూప దర్శనం ఒక అపురూప ఘట్టమని తెలిపారు.











