కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేసినవాళ్లకు జరిమానాలు విధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి రాచకొండ పోలీసులు జరిమానా విధించారు. కర్మాన్‌ఘాట్ చౌరస్తా వద్ద తనిఖీలు చేపట్టిన సరూర్ నగర్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో మాస్కు లేకుండా తీగల కృష్ణారెడ్డి కారులో వెళుతున్నాడు. పోలీసుల కంట పడటంతో రూ.1000 ఫైన్ విధించారు. ఈ క్రమంలో ఎస్ఐ, తీగల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. చట్టం ముందు అందరూ సమానమేనని రాచకొండ పోలీసులు ఆయనకు తెలిపారు.
పట్టాలపైకి కడప స్టీల్ ప్లాంట్.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...











