కరోనా కేసులు పెరుగుతుండటంలో దేశంలోని కొన్ని ప్రాంతాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. మరణాల రేటు తగ్గించేందుకు, కేసుల తగ్గుదలకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం హైదరాబాద్ లోని సరూర్ నగర్ డివిజన్ స్వచ్ఛందంగా లాక్ డౌన్ చర్యలకు దిగుతోంది. ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి ఉదయం 5 గంటల వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్ నిర్వహిస్తున్నట్లు ఆ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ పేర్కొన్నారు. ఈ నెల 17 వరకు లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందని ఆమె తెలిపారు. ఈ మేరకు సరూర్ నగర్ లోని వ్యాపారులు, ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలన్నారు. కచ్చితంగా మాస్కు ధరించాలని సూచనలు చేశారు.
మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...










