ముఖ్యమంత్రి జగన్‌కు మద్యం ఆదాయంపై ఉన్న ఆరాటం కరోనా కట్టడిలో లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.మద్యం దుకాణాల వద్ద పోలీసులు సోషల్ డిస్టెన్స్ పాటించేలా విధులు నిర్వహిస్తున్నారని, కానీ కరోనా టీకా కేంద్రాల వద్ద మాత్రం తొక్కిసలాట తప్పడం లేదని ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. నెల్లూరు జిల్లాలో మద్యం కొనుగోలుకు వచ్చిన మందుబాబులను ఓ పోలీస్ అధికారి సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేశారు. కానీ గుంటూరు జిల్లాలో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగిన వీడియోను లోకేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆదాయంపై ఆరాటం
సీఎం జగన్‌రెడ్డి తన సొంత బ్రాండ్లు అమ్ముకోవడం ద్వారా మద్యం అమ్మకాలు పెంచేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు మాత్రం చూపడం లేదని లోకేష్ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. తాగేవారికి అనారోగ్యం, జేబులు ఖాళీ, తాగించేవాడికి మాత్రం ఆదాయం తెచ్చిపెట్టే మద్యం షాపుల ముందు మద్యపాన ప్రియులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
కరోనా నుంచి రక్షించే వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన జనానికి మాత్రం వ్యాక్సిన్ అందించక దొమ్మీకి వదిలేసి కోవిడ్ వ్యాప్తికి మరింత కారణం అవుతున్నారు.(2/2)
— Lokesh Nara (@naralokesh) May 8, 2021











