జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. చికిత్స చేసిన వైద్యులు మూడు రోజుల క్రితం ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కొద్దిగా నీరసం మినహా పవన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారన్నారు. ఆయన కోలుకోవాలని పూజలు నిర్వహించిన జనసైనికులకు, ఇతరులకు పవన్ కృతజ్ణతలు తెలిపారు.












