ఏపీ సీఎం చంద్రబాబు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు ఓకే చెప్పింది మంత్రి వర్గం. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని కోరగా..లులు సంస్థ ఓకే చెప్పిందన్నారు.
నిజానికి 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నం సాగర తీరంలో లులు మాల్‌కు స్థలం కేటాయించింది. అయితే, తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో సీన్ రివర్స్ అయింది. వైసీపీ ప్రభుత్వ తీరుతో లులు మాల్ కాస్త హైదరాబాద్‌కు తరలిపోయింది. ఐతే ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లులు సంస్థ మళ్లీ ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. వైజాగ్‌లో మాల్ ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమ్మతి తెలియజేసింది. దానికి తాజాగా కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలిపింది.
మరోవైపు రాజధాని అమరావతి పనులను ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా పున:ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వాహనించనున్నారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రులతోనూ సమావేశం కానున్న చంద్రబాబు. ప్రధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల గురించి ఆర్థిక మంత్రితో చర్చించనున్నరు నిధులు విడుదల చేయాలని నిర్మలను కోరనున్నారు.
వైసీపీ హయాంలో లులూ సంస్థని ఏపీ నుండి తరిమివేశారు.. ఆ సంస్థ సుమారు 2 వేల కోట్ల రూపాయల పెట్టుబడితోపాటు వేల మందికి ఉపాధి కల్పించడానికి ముందుకు వచ్చింది.. చంద్రబాబు నాయుడు లాంటి సమర్ధ నాయకత్వాన రాష్ర్టం వడివడిగా అభివృద్ధి చెందడం ఖాయమని భావించిన లులు సంస్థ యజమాని యూసుఫ్ ఆలీ ముసలీయం వీట్టిల్ అబ్దుల్ ఖాదిర్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి సన్నద్ధం అయ్యారు.. 2014 -19 సమయంలో మొదట వైజాగ్‌లో మాల్ ఏర్పాటుకి రెడీ అయ్యారు.. భూకేటాయింపులు సైతం జరిగాయి.. 19లో సర్కార్ మారడంతో జగన్ .. ఆ సంస్థని తరిమికొట్టారు.. పైసా పెట్టుబడి పెట్టకుండా పరుగులు పెట్టించారు.. దీంతో, లులు యజమాని హైదరాబాద్‌లో భారీగా ఓ మాల్ ఏర్పాటు చేశారు.. తాజాగా చంద్రబాబు అధికారంలోకి రావడంతో మరోసారి సంప్రదింపులు జరపడంతో లులు సంస్థ ఈ దఫా వేగంగా పలు నగరాలలోనూ తన బ్రాంచ్‌లని విస్తరించడానికి సన్నద్ధం అయింది.. వేల ఉద్యోగాల కల్పనకి జై కొట్టింది.. బ్రాండ్ చంద్రబాబు ఇమేజ్‌ని ముందుకు తీసుకుపోతోంది లులు సంస్థ..