మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న మంచు విష్ణు తన మ్యానిఫెస్టో ప్రకటించారు. సభ్యుల సంక్షేమానికి తన మ్యానిఫెస్టోలో పెద్ద పీట వేశారు. తమ ప్యానల్ ను గెలిపిస్తే ఓ యాప్ క్రియేట్ చేసి నటులందరికీ అవకాశం కల్పిస్తానన్నారు. రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడి అర్హులైన నటులకు సొంత ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మా అసోసియేషన్ భవనాన్ని సొంత డబ్బులతో కట్టిస్తానన్నారు.
మ్యానిఫెస్టోల్ ప్రధానాంశాలు
1. మా యాప్ లో నటుల సమాచారం ఉంటుంది. నిర్మాతలు, దర్శకులు, రచయితలు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లకు యాక్సెస్ ఉండేలా చూస్తారు. జాబ్ కమిటీని ఏర్పాటు చేసి వారికి సినిమాలు, ఓటీటీలో అవకాశాలకు ప్రయత్నం చేస్తారట.
2. మా సభ్యులందరికీ సమగ్రమైన ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారు. కార్పొరేట్ ఆస్పత్రులతో అనుసంధానం చేస్తారు. ప్రతి మూడు నెలలకూ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. మొత్తం 946 మంది సభ్యులకు ఇఎస్ఐ హెల్త్ కార్డు అందిస్తారు. ఇప్పుడు అమలులో ఉన్న మూడు లక్షల రూపాయల జీవిత భీమా పెంచే ఏర్పాటు చేస్తారు.
3. అర్హులైన మా సభ్యల పిల్లలకు పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకూ ఉచిత విద్య అందిస్తారు.
4. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. లక్షా 16 వేల ఆర్థిక సహాయం అందజేస్తారు.
5. మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణ కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు. వయసుతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ ఆర్థిక సహాయం.
6. పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన అందరికీ 6 వేల రూపయలు పెన్షన్ సదుపాయం.
7. మా సభ్యత్వ రుసుమును రూ. 75 వేలకు తగ్గించే ఏర్పాటు.
8. నిధుల సమీకరణ కోసం కల్చరల్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు. తద్వారా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, క్రీడా పోటీల నిర్వహణ, ఉత్సవాలు లాంటివి నిర్వహిస్తూ మాను బలోపేతం చేయడం.
9. మా సభ్యుల పిల్లలకు సినిమాలంటే ఆసక్తి ఉంటే మోహన్ బాబు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా 50 శాతం స్కాలర్ షిప్ తో శిక్షణ. ఇతర ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లతో కూడా రాయితీ ఇప్పించే ఏర్పాటు.
10. చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సహకారం కోరటం.
సభ్యుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ మ్యానిఫెస్టోని రూపొందించారు.
Must Read ;- ‘మా’ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?











