మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఎన్నికలను ఇరు వర్గాలు చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకున్నాయి.
ఒకరి పై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య నువ్వా..? నేనా..? అన్నట్టుగా పోటీ ఏర్పడింది. దీంతో మా అధ్యక్ష పదవిని దక్కించుకునేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించి ఆఖరి నిమిషంలో తప్పుకున్న సీనియర్ నటుడు సీవిఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంంటే… మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను గెలిపించండి. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి.
దేశం అన్నా.. దేవుడు అన్నా.. చులకన భావం వున్న ప్రకాష్ రాజ్ ను ఓడించండి. ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా వుంటే బాగుంటుంది. బహుశా అతను విత్ డ్రా చేసుకుంటాడు అని ఆశిస్తున్నాను అన్నారు.
Must Read ;- మా ఎన్నికల్లో కుట్ర విష్ణు పై ప్రకాష్ రాజ్ ఫిర్యాదు











