నందమూరి నటసింహం బాలయ్య ఇప్పటి వరకు వెండితెర పై సంచలనం సృష్టించారు. ఇప్పుడు బుల్లితెర పై సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అవును.. బాలయ్య ఓటీటీలో హోస్ట్ అవతారం ఎత్తుతున్నారు. షాక్ అయ్యారా..? కానీ.. ఇది నిజంగా నిజం. బాలయ్య ఇప్పటి వరకు గెస్ట్ గా వెళ్లారు కానీ.. హోస్ట్ గా వెళ్లలేదు. ఇప్పుడు హోస్ట్ గా మారబోతున్నారు. హోస్ట్ గా ఇంటర్ వ్యూలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అబ్బాయ్ ఎన్టీఆర్ బిగ్ బాస్, ఎవరు మీలో కోటీశ్వరుడు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ దూసుకెళుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు అబ్బాయ్ కి పోటీగా బాలయ్య రంగంలోకి దిగుతున్నారు. తెలుగు ఓటీటీ ఆహా ఓ టాక్ షో ప్లాన్ చేసింది. మూడు నెలల క్రితమే బాలయ్యను సంప్రదిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అఖండ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఈ టాక్ షో పై దృష్టి పెడతారని అంటున్నారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేదు. అభిమానులకు ఇది షాక్ న్యూస్ అని చెప్పచ్చు. ఆయన ఎలా మెప్పిస్తాడు..? అసలు ఈ టాక్ షో ఎలా ఉండబోతుంది..? ఇలా అనేక ప్రశ్నలు.
బాలయ్య చేసే ఈ టాక్ షోకి మొదటగా వచ్చే గెస్ట్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. బాలయ్య కనుక చిరంజీవిని ఇంటర్ వ్యూ చేస్తే.. అటు మెగా అభిమానులకు ఇటు నందమూరి అభిమానులకు పండగే అని చెప్పచ్చు. మరో విషయం ఏంటంటే.. ఈ టాక్ షోను డైరెక్ట్ చేసేది దర్శకుడు క్రిష్ అని వార్తలు వస్తున్నాయి. చాలా డిపరెంట్ గా క్రిష్ ఈ షోను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే… ఈ టాక్ షోతో బాలయ్య అభిమానులకు పండగే.
Must Read ;- బాలయ్య అఖండ టార్గెట్ ఇదే











