బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువని నటి కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ కు మద్దతుగా నటి మాధవీలత తన ఫెసుబుక్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో ‘తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సార్లు మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. పీతకన్నూ కాకుండా సీరియస్ కన్ను వేయండి. మన ఇండస్ట్రీ లో బాగా వాడుకలో ఉంది. అది లేకుండా కొన్ని పార్టీ లు జరగవు ఇక్కడ 2009 లో వచ్చారు పొలిటికల్ అండ తో వెనక్కి పోయారు. పాపం డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి Other Department కి పడేసారు చట్టానికి చేతులు చాల పెద్దవి అందుకే అవి చాచితే విరగొడతారు చాల దారుణాలు జరుగుతున్నాయి మత్తులో” అంటూ తన ఆవేదనను తెలియచేస్తూ పోస్ట్ పెట్టారు.
మంచి ఉద్దేశంతో ఆమె చేసిన పోస్ట్ తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కోపాన్ని తెచ్చింది. ఐదేళ్ల కిందట జరిగితే ఇప్పుడు చెప్పడమేంటని అధికారులు అన్నారు. డ్రగ్స్ వాడకం లాంటి ఘటనలు ప్రస్తుతం ఆమె దృష్టికి వస్తే తమకు తెలపాలని కోరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఏంటని ఆమెను ప్రశ్నించారు. ఆధారాల మీద మాత్రమే తమ శాఖ పని చేస్తుందని ఆమె గుర్తించుకోవాలని వెల్లడించారు. మొత్తం మీద ఆమెకు ఎక్సైజ్ శాఖ క్లాస్ తీసుకుంది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది.
దీంతో నటి మాధవీలత ఆ ఛానల్ ను ఉద్దేశించి మరో పోస్ట్ పెట్టారు. ” నా అభిప్రాయం కోసం ఒకటికి పది సార్లు మీరు ఫోన్ చేశారు. దాదాపు 10 ప్రశ్నలు అడిగారు. రిపోర్టర్ కు అన్నీ విషయాలు చెప్పాను. డ్రగ్స్ విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకే నేను పోస్ట్ పెట్టాను. అంతే తప్పా ఎవరిపై ఆరోపణలు చేసేందుకు ఆ పోస్ట్ పెట్టలేదు. నాకు ఏమైనా అయితే ప్రభుత్వం, మీడియా బాధ్యత వహించాలి. మీకు నచ్చిన పాయింట్స్ ఎడిటింగ్ చేసుకొని నన్ను క్రిమినల్ చేయాలనుకోవడం ధర్మం కాదు. ఓ భారతీయురాలిగా, బీజేపీ నాయకురాలిగా డ్రగ్స్ ఫ్రీ దేశం కోసం నేను మాట్లాడాను. నాకు ఎటువంటి హెచ్చరికలు రాలేదు. రాకముందే హెచ్చరికలు అంటూ ప్రసారం చేయడమేంటి? దయచేసి ఫేక్ కథనాలు ప్రసారం చేయవద్దు. మీ కథనాల ద్వారా నన్ను ఓ క్రిమినల్ చేశారు. నేను డ్రగ్స్ తీసుకునే వారి పేర్లు చెబితే వారి గురించి చెప్పే ధైర్యం మీకు ఉండదు. అలాంటి సందర్భంలో నేను ఎందుకు ఆ పేర్లు చెప్పాలి.” అంటూ ఆమె తెలిపారు.
ఆ తరువాత భావోద్వేగంతో మరో పోస్ట్ పెట్టారు. ” మనసులో మాట నేను బాగుండాలి నాతో పాటు ఈ సమాజం బాగుండాలి అని కోరుకోవడం నా నేరం. నాకు ఒక రోజు వస్తది. ఈ సంఘం “డబ్బు “,”పదవి” ఈ రెండింటికి మాత్రమే బయపడుద్ది దాసోహం అంటుంది. ఈ రోజు అవి నాకు లేకపోవొచ్చు. ఒక రోజు త్వరలోనే వస్తుంది ఆ రోజు చెప్తాను. అందరిని లెక్కపెడుతున్న ……అన్ని గుర్తుపెట్టుకుంటా …..నన్ను తిట్టిన నోర్లు …….నన్ను శపించిన నోర్లు …..నన్ను తక్కువగా చుసిన కళ్ళు ….నన్ను తొక్కేయాలనుకున్న మనుషులు ….నన్ను హింసించిన మనసులు …..నన్ను నిందించిన గొప్పవాళ్ళు ……నన్ను బెదిరించిన వాళ్ళు అందరు … అందరూ …..అందరిని గుర్తుపెట్టుకున్న …..నేనేమి చేయను ……కానీ అందరి నోర్లు మూసుకుంటాయి. మొరిగే కుక్కలు ఎపుడు వీధుల్లోనే ఉండిపోతాయి. నేను మాత్రం ఆకాశమంత … ఆడది ఎపుడు ఆకాశం లో సగం ఆమె కష్టాలతో పుడుతుంది కష్టాలతో పోరాడుతుంది
కష్టాల్లో బతుకుతుంది ….ఓర్వలేని వాళ్ళు ఓర్చుకోలేని నోర్లు వాగుతూనే ఉంటాయి కానీ నేను సాగుతునే ఉంటాను ….
నేను నమ్మిన నిజం మా అమ్మ నేర్పిన గుణం ….💓💓💓నేను నమ్ముకున్న నిజాయితీ ✊🏻✊🏻✊🏻✊🏻 మా నాన్న ఇచ్చిన రక్తం నాలో ఉండగా …..ఆ దేవుడు నన్ను శిక్షించాలి తప్ప ఈ భూమి మీద శక్తులు మొరిగే కుక్కలు నన్ను ఏమి చేయలేవు. నేనే నా సైన్యం ….నేనే నా బలం ……….నేను ఒక మహిళను ….పోరాటమే నా ఆయుధం …..నాకు భయాలు ఉంటాయి …బంధాలు ఉన్నాయి ….కానీ ……నేను మీలాగా చేతకాని దాని కాదు. ముఖాలు దాచుకుని రాతలు రాయను. నేను ఒక ధైర్యాన్ని. నేను ఒక పయనాన్ని నేను ఒక గమ్యాన్ని ఎవరో వస్తారని ఎదో చేస్తారని నేను ప్రయాణం మొదలు పెట్టలేదు. కనుక ఎవరో ఆపేస్తారని నాకు భయం లేదు …. ఆడపిల్ల బయటకి వస్తే నిందలు. నటి అయితే ఆమె పతిత అయినట్లే. ఇక్కడంతా రాముల్లె అన్నట్లు …..అందరి భావన ఎవడు ఉత్తముడు లేదు తల్లిని ప్రేమగా చూస్తూ పక్కింటి తల్లిని కామం తో చూసే కొడుకులు కుక్కలున్న సమాజం …. మీకు ఒక మహిళని అనే అర్హత లేదు ఆమె బయటకి వస్తే బరితెగించింది అంటారు. ఆమె పని చేస్తే పతిత అంటారు. ఆమె గొంతు విప్పితే పది మందితో పడుకుంది అంటారు. అసలు నువ్వెవడురా ??????
ఒక మహిళా స్థానాన్ని నిర్ణయించడానికి నీలాటివాడే తల్లి స్థనాన్ని తాకి ఆమె స్థానం ని ప్రశ్నించేది. ఎవడివిరా నువ్వు నీ బతుకేంటి ?????? నీ నోరు నీ మెదడు చెడిపోయింది కనుకే నువ్వు ఇలా అందరు చెడిపోయారు అనుకుంటావు. చెడింది ఆమె కాదు రా నువ్వు నీ ఆలోచన. నిన్ను కన్నది నాలాంటి ఒక ఆడదే. చెడ్డ భార్య చెడ్డ ప్రియురాలు ఉంటాదేమొ కానీ చెడ్డ తల్లి ఉండదు. గుర్తు పెట్టుకో ప్రతి అమ్మాయి ఒకరికి ప్రియురాలే ఒకరికి భార్యే. ఆమె తల్లి గ మారుతుంది రా నీతిలేని కుక్కా. నన్ను తిట్టే బూతులు తప్పుగా మాట్లాడే ప్రతి వీధి కుక్కలాంటి మనుషులకి చెప్తున్నా నీ కంటే అడవిలో మృగాలే మంచివి ….నువ్వూ డాష్ అని నన్ను అనే ప్రతి డాష్ గాడికి చెప్తున్నా మగాడు లేకుండా ఆడపిల్ల ఎలా చెడిపోతుంది రా కుక్క. మగాడు అంత మంచోడేలా అవుతాడు. ఆడది చెడింది ఎందుకు అవుతుందిరా,,????
అసలు పరాయి అమ్మాయి ఎలాంటిదో నువ్వు ఎవడురా సర్టిఫికెట్ ఇవ్వడానికి … ???నువ్ ఎవడురా నిర్ణయించడానికి ???? మగాళ్లంతా ఉత్తములు. అమ్మాయిలు పతితలా ????? అయితే నీ తల్లి అక్క చెల్లి భార్య కూడా పతితలే కదరా ???అమ్మాయిలని కడుపులో చంపేస్తున్నారు. అమ్మాయిలని పుట్టగానే పడేస్తున్నారు. కాస్త ఎదిగాక సమాజం అరాచకాలు. అంత కస్టపడి ఎదో సాధించాలి. తనకి నచ్చిన ఫీల్డ్ లో ఎదగాలి అంటే సూటి పోటీ మాటలు ఎందుకు???? మా నాన్న నా అన్నలు కూడా మగాళ్లే ఎపుడు ఒక ఆడపిల్లని తప్పుగా చుసిన కళ్ళు కాదు మాటలన్న నోర్లు కాదు. అందుకే నాలాంటి కూతుర్లకు స్వేచ్ఛనిచ్చిన తండ్రులకి అన్నలకి తమ్ముళ్ళకి ఆమె విలువ తెలుసు. ఆమె శక్తి తెలుసు ఆమె తెగువ తెలుసు. ఆమె ఆదిశక్తి అని తెలుసు…
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం. సరే తిట్టేవాళ్ళు తిట్టని ఏడ్చేవాళ్ళు ఏడవని నేను నమ్మిన మార్గం మంచిదైనపుడు నేనెందుకు ఆగిపోవాలి ,????? నేను ఆగిపోతే ఈ గురివింద సమాజం గు …… నలుపు మూసుకొని నన్ను అంటుంటే నేను బయపడి పారిపోయినట్లు …మీ చేతకానీ తనానికి నేనెందుకు బలి కావాలి ..,సింహంతో ఆట మాధవి తో మాట జాగర్తగా వాడాలి …. నేను నమ్మింది మనిషిని కాదు నిజాన్ని నిజాయితీని …… నిజమే గెలుస్తుంది అన్నది నిజమే కానీ గెలిచేదంతా నిజం కాదు” ఆమె తన ఆవేదనను పోస్ట్ చేశారు.











