టాలీవుడ్ లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన నిర్మాత యం.యస్.రాజు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ హీరో గా ‘తూనీగా తూనీగా’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘కేరింత, అంతకు ముందు ఆ తర్వాత’ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న రెండు మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి.
ఇక సుమంత్ అశ్విన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతుండడం విశేషం. డల్లాస్ లో యం.యస్ చేసిన బంధువుల అమ్మాయి దీపికతో అతడి వివాహాన్ని యం.యస్.రాజు కుటుంబ సభ్యులు ఖాయం చేశారు. ఈ నెల 13న అంటే వేలెంటైన్స్ డే కి ఒక రోజు ముందుగానే సుమంత్ అశ్విన్.. దీపిక మెళ్ళో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. హైద్రాబాబ్ శివార్లలో సినీ ప్రముఖులు , కుటుంబ సభ్యులు , బంధుమిత్రుల సమక్షంలో అత్యంత వైభవంగా జరగబోతోంది.
Must Read ;- పవన్ కళ్యాణ్ తో ఎం.ఎస్.రాజు సినిమా నిజమేనా.?