ప్రతిది ఇప్పుడు ఇన్‌స్టంట్ అయిపోయింది. ఎంతో హడావుడి, శ్రమ ఉండే సినిమా రిలీజ్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. అంతా ఆన్‌లైన్‌లో నిమిషాల్లో జరిగిపోతున్నాయి. ఓటిటి రిలీజులు వచ్చాక థియేటర్ కి బయటకి కనపడని లాస్ అయితే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ‘ఎలాంటి పొరపాట్లకి స్పేస్ ఇవ్వకూడదు. చిన్న రాంగ్ స్టెప్ వేస్తే అంతే సంగతలు, సిల్వర్ స్క్రీన్ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతాం’ అనుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఇప్పుడు ఇదే చింతలో ఉన్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు.
మహర్షి తరువాత మహేశ్ బాబు నిజానికి సుకుమార్ తో సినిమా చేయాలి, కానీ అనుకోకుండా చాలా సైలెంట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమాని పట్టాలెక్కించేశాడు. అయితే మహేశ్ ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడట! దానికి కారణం సంక్రాంతి రేస్ లో తాను వెనక పడిపోవమే!
దీనికి తోడు మహేశ్ మధన పెడుతున్న మరో మ్యాటర్ పుష్ప సినిమా. ఈ సినిమా స్టోరీ అల్లు అర్జున్ కంటే ముందు మహేశ్ వద్దకే వెళ్లింది కానీ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం, చాలా రస్టిక్ గా క్యారెక్టర్ ఉందనే అపనమ్మకంతో రిజెక్ట్ చేశాడు. బన్నీ ఈ కథను ఒప్పుకుని సినిమాను మొదలుపెట్టేశాడు.
తాను రిజెక్ట్ చేసిన కథను బన్నీ ఒకే చేయడంతో ఈ మూవీ అప్ డేట్స్ గురించి ఎప్పటికప్పుడు కూపీ లాగుతున్నాడట మహేశ్ బాబు. కథలో కొన్ని సీన్స్ వేరే లెవల్ ఉండటంతో మహేశ్ తాను తప్పు చేశానేమే అనే గిల్ట్ ఫీలింగ్ ఉన్నాడని టాక్ నడుస్తోంది. అలానే పరుశరామ్‌తో కమిట్ అయినా ‘సర్కారువారి పాట’ స్టోరీ డెవలప్మెంట్లో కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.











