తీన్మార్ మల్లన్న ఓటమి తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లంకపల్లి గ్రామానికి శ్రీశైలం అనే యువకుడు మల్లన్నకు వీరాభిమాని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మల్లన్న తరపున ప్రచారం చేశాడు. మల్లన్నకు అనుచరుడిగా పేరు తెచ్చుకున్నాడు. గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశాడు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న పరాజయం కావడంతో ఓటమి తట్టుకోలేకపోయాడు. ఓటమి బాధతో ఆదివారం పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు.
స్పందించిన మల్లన్న
శ్రీశైలం ఆత్యహత్యకు పాల్పడిన సంఘటనపై తీన్మార్ మల్లన్న స్పందించాడు. శ్రీశైలం నాకు తమ్ముడలాంటివాడని అన్నారు. తనతోపాటు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడన్నారు. రాష్ట్రం లో మార్పు తీసుకురావాలనే ఎంతో ఆశపడ్డాడు. అలాంటి వ్యక్తి దూరం కావడంతో తనను కలిచివేసిందన్నారు. అభిమానులు ఆత్యహత్యలకు పాల్పడవద్దని, పోరాడి హక్కులను సాధించుకోవాలన్నారు.