‘ఆర్.ఎక్స్. 100’ మూవీతో టాలీవుడ్ లో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. రెండో సినిమా ‘మహాసముద్రం’ ను విడుదలకు సిద్ధం చేశాడు. శర్వానంద్, సిద్ధార్ధ హీరోలుగా.. అదితీరావు హైదరి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వైజాగ్ బీచ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథగా.. ఈ మూవీ ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇక ఈ సినిమాలో ఓ సూపర్ ఐటెమ్ సాంగ్ ఉండబోతోందని.. అది ‘ఆర్.ఎక్స్ 100’ బ్యూటీ పాయిల్ రాజ్ పుత్ మీద చిత్రీకరించబోతున్నారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు దర్శకుడి ఆలోచన మారిందట.ఆ ఐటెమ్ సాంగ్ ను అందాల అనసూయ మీద షూట్ చేయబోతున్నారట. ప్రస్తుతం పాయల్ కన్నా అనసూయ కే ఎక్కువ క్రేజున్న నేపథ్యంలో దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడట.
రీసెంట్ గా విడుదలైన ‘చావుకబురు చల్లగా’ సినిమాలో పైన పటారం లోన లొటారం అనే ఐటెమ్ సాంగ్ కి అనసూయ.. అందాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిపోయాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. అందులో అనసూయ సాంగ్ ను చూడడానికే జనం వెళ్తున్నారన్నది వాస్తవం. అందుకే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకో వాలనుకుంటున్నాడట దర్శకుడు అజయ్ భూపతి. ఈ ఐటెమ్ సాంగ్ చేయడానికి అనసూయ కూడా భారీ ఎత్తునే డిమాండ్ చేస్తోందట..
Also Read : వయ్యారాల అనసూయను చూస్తే వామ్మో అనాల్సిందే











