ప్రభాస్ కొత్త సినిమా ‘ ఆది పురుష్ ‘ ప్రకటన రాగానే అందరూ ఉర్రూత లూగారు . రామాయణం కథ లో శ్రీ రాముడి పాత్ర పోషించే అవకాశం ప్రభాస్ కి వచ్చిందని ఆనందపడుతున్నారు . ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో రామాయణం ఎన్నిసార్లు వచ్చిందో తెలుసుకుందాం . మూకీ కాలం నుంచి రామాయణం కథాంశంగా సినిమాలు వచ్చాయి శాంతా రామ్ లాంటి మహా దర్శకుడు కూడా ‘ చంద్ర సేన ‘ అనే మూకీ సినిమా తీశారు .1942 నుంచి ఎన్నో సార్లు రామాయణం హిందీ తెర పై వచ్చింది .
విజయ్ భట్ అనే హిందీ దర్శకుడు నాలుగైదు సార్ల పైన రామాయణం తీశారు.1942 లో ‘ భారత్ మిలాప్’ ,1943 లో ‘ రామరాజ్య ‘ ,1948 లో ” రామబాణ ” రూపొందించారు . ఇవన్నీ బాగా సక్సెస్ అయ్యాయి. ప్రేమ అరీబ్ రాముని గా, శోభన సిద్దార్ధ సీత గా నటించారు అదే విజయ్ భట్1967 లో బీనా రాయ్ సీతా దేవి గా ‘ రామరాజ్య ‘ సినిమా తీస్తే అట్టర్ ప్లాప్ అయింది . ఆ తర్వాత విజయభట్ రామాయణం జోలీ కి వెళ్ళలేదు . మీనాకుమారి సీత గా ‘ హనుమాన్ పటేల్ విజయ్ ‘ అనే సినిమా1954 లో వచ్చి విజయవంతమైంది.
బాబూ భాయ్ మిస్త్ర అనే డైరెక్టర్ రెండు మూడు సార్ల పైన రామాయణం తీశారు .1961 లో ‘ సంపూర్ణ రామాయణ ‘ ,1974 లో ‘హనుమాన్ విజయ్ ‘ సినిమాలు తీశారు . ఇక1976 లో దారాసింగ్ హనుమంతుడి గా నటించిన ‘ భజరంగి భళి ‘ సినిమా సూపర్ హిట్ అయింది . సీత గా మౌసమి ఛటర్జీ , శ్రీ రాముడి గా బిశ్వజిత్ నటించారు . రామానంద్ సాగర్ ‘ రామాయణ’ టీవీ సీరియల్1986-87 ప్రాంతంలో దేశ వ్యాప్తంగా అందరి ఆదరణ పొందింది . ఇక హిందీలో చిట్ట చివరిసారిగా మన తెలుగువారు అయిన వి. మధుసూదనరావు దర్శకత్వంలో ‘ లవ కుష్’ అనే సినిమా వచ్చింది . జితేంద్ర శ్రీరాముడిగా, జయప్రద సీతగా నటించారు.
బాలీవుడ్ ధోరణి గమనిస్తే రామాయణం మీద సినిమా వచ్చి పాతికేళ్ళు అవుతుంది . రామాయణం సినిమా గా సక్సెస్ అయి 45 సంవత్సరాలు కావస్తోంది . మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులు ఎవరూ ఇంతవరకూ నటించలేదు . పాన్ ఇండియా సినిమా గా తీసే ప్రయత్నం చేయ లేదు . ఆ లెక్కన ప్రభాస్ ‘ ఆది పురుష్ ‘ అన్ని విధాలా సంచలనం కావచ్చు.