తెలుగు రియాల్టీ షోస్ లో అత్యధిక పాపులారిటీ తెచ్చుకున్న షో బిగ్ బాస్ . మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని.. ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది ఈ షో. కరోనా కారణంగా అసలు బిగ్ బాస్ నాలుగో సీజన్ ఉంటుందా ఉండదా అనే సందేహాలు తలెత్తాయి. కంటెస్టెంట్స్ దాదాపు 100 రోజాల పాటు పాల్గొనాల్సి ఉండడంతో.. కరోనా వ్యాపించే అవకాశాలున్నాయని ఇప్పటివరకూ షోను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడప్పుడే ఈ గొడవ తేలకపోవడంతో .. తగు జాగ్రత్తలు తీసుకొని , కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ.. బిగ్ బాస్ -4 కి సన్నాహాలు మొదలుపెట్టారు.
ముందుగా ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి చేశారు. అంతేకాదు వీరిందరికీ కరోనా టెస్టులు చేసి.. నెగెటివ్ వచ్చిన వారినే హౌస్ లోకి పంపడానికి నిర్ణయించుకున్నారు నిర్వాహకులు. ఇటీవల బిగ్ బాస్ 4 కోసం ఎంపిక చేసిన 16 మందికీ కరోనా టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది. అంతేకాదండోయ్.. వీరిని మళ్లీ 14 రోజుల పాటు పరిశీలించి.. ఎలాంటి లక్షణాలు కనిపించని వారినే హౌస్ లోకి పంపనున్నారట.
బిగ్ బాస్ .. మూడో సీజన్ లో ఎంతో స్టైలిష్ గా హోస్టింగ్ చేసిన అక్కినేని నాగార్జునే సీజన్ 4 కి కూడా హోస్ట్ గా రానున్నారు.
ఇటీవల నాగ్ .. ఓల్డ్ గెటప్ లో బిగ్ బాస్ ప్రొమో లో కనిపించగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. లాస్టియర్ షో లో కంటెస్టెంట్స్ అందరూ ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంటర్ టైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ మరింతగా షోను రక్తి కట్టించనున్నారట. ఈ నేపథ్యంలో జనంలో ఎంతో క్రేజ్ ఉన్న అన్ని వర్గాలకు చెందిన ఫేమస్ పెర్సనాలిటీస్ ను సీజన్ 4 కోసం ప్రత్యేకంగా ఎంపికచేశారు.
బిగ్ బాస్ -4 కంటెస్టెంట్స్ లిస్ట్ :
సింగర్ సునీత : ఎంతో శ్రావ్యమైన గాత్రంతో .. దాదాపు 25 ఏళ్ళుగా టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన పాటలతో అలరిస్తూ ఉంది సునీత. అంతేకాదు ఎందరో స్టార్ హీరోయిన్స్ కు గాత్ర దానం చేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ సత్తా చాటుకుంది. ప్రస్తుతం పాటలతోనూ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ ఫుల్ బిజీగా ఉన్న ఆమె .. బిగ్ బాస్ 4 లో కంటెస్టెంట్ గా ఎంపికవడం అందరీకీ ఆసక్తిగా మారింది. అయితే సునీత తనకు కరోనా వచ్చిందని, దాన్నుంచి బయటపడ్డానని ప్రకటించింది.
హంసానందిని : వంశీ ‘అనుమాస్పదం’ చిత్రంతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. మొదటి సినిమా అంతగా ఆడకపోవడంతో .. అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే ఆమెకు హీరోయిన్ గా కన్నా.. వ్యాంప్ కేరక్టర్స్ , ఐటెమ్ గాళ్ గానూ ఎక్కవ అవకాశాలు రావడంతో .. వాటితోనే ఆమె తన కెరీర్ ను కొనసాగిస్తోంది.
శ్రద్ధాదాస్ : అల్లరి నరేశ్ ‘సిద్ధూ ఫ్రం సికాకుళం’ మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. అందాల ఆరబోతలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకపోవడంతో .. ఆపై .. హిందీ, కన్నడ, మలయాళ , బెంగాలీ చిత్రాల్లోనూ ఆఫర్స్ అందుకుంది. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా..ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కేవలం గ్లామర్ గాళ్ గానే ఫోకస్ అవడంతో .. ఆమె కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. ఇప్పుడు బిగ్ బాస్ 4కి ఎంపికవడం.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
పూనమ్ బజ్వా : ‘మొదటి సినిమా’ మూవీతో తెలుగు లో కథానాయిక గా అడుగుపెట్టింది పూనమ్ బజ్వా. ఆ తర్వాత నాగార్జున బాస్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో సైతం తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఎర్లియర్ గా ‘యన్టీఆర్ కథానాయకుడు’ లో లోకేశ్వరి గా నటించి మెప్పించింది.
జబర్దస్త్ రాం ప్రసాద్: సుడిగాలి సుధీర్ టీమ్ లో రామ్ ప్రసాద్ .. చాలా కీలకమైన ఆర్టిస్ట్. పంచులు పేల్చడం , స్కిట్స్ తానే స్వయంగా రాయడం అతడి పని. ముఖ్యంగా మనోడు ఆటో పంచులు పేల్చడంలో సిద్ధహస్తుడు. జబర్దస్త్ ప్రారంబించినప్పటినుంచి రామ్ ప్రసాద్ ఆ టీమ్ లో ప్రముఖ వ్యక్తిగా కొనసాగుతున్నాడు. దానికితోడు .. అతడికి జనంలో బాగా క్రేజ్ కూడా ఉండడంతో.. బిగ్ బాస్ 4 కి సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతాడని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
జబర్దస్త్ నరేశ్ : బుల్లెట్ భాస్కర్ టీమ్ లోనూ, పంచ్ ప్రసాద్ టీమ్ లో నూ పొట్టి నరేశ్ కమెడియన్ గా చేశాడు. ఇప్పుడు మరో టీమ్ లోకి మారాడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు మనిషి పొట్టిగా ఉన్నా. కామెడీ చేయడంలో చాలా గట్టి. అందుకే బిగ్ బాస్ 4కి నరేశ్ కూడా మంచి ఆకర్షణ అవుతాడని భావిస్తున్నారు.
వైవా హర్ష : వైవా అనే షార్ట్ ఫిల్మ్ తో అందరి దృష్టినీ ఆకర్షించాడు హర్షా. దాంతో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ తో బాగా ఫోకస్ అయ్యడు . ఆ క్రెడిట్ తోనే సినిమాల్లోనూ కొన్ని మంచి పాత్రలు పోషించాడు. బిగ్ బాస్ 4కి హర్షా ప్రెజెన్స్ కూడా బాగుంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
నందు : సుకుమార్ 100 % లవ్ సినిమాతో టాలీవుడ్ లో నటుడిగా ప్రవేశించాడు నందు. సింగర్ కూడా నందు బాగా పాపులర్. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నందు నటించాడు. సింగర్ గీతా మాధురిని పెళ్లి చేసుకొని మరింతగా జనంలో ఫోకస్ అయ్యాడు.
మహాతల్లి (జాహ్నవి దాశెట్టి ) : మహాతల్లి వెబ్ సిరీస్ తో యూ ట్యూబ్ లో మంచి పాపులరైంది జాహ్నవి దాశెట్టి. ఈ సిరీస్ తర్వాత ఆమె అసలు పేరు ఎవరికీ గుర్తుకు రావడం లేదు. ఆపై మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ, సినిమాల్లోనూ కనిపిస్తూ. మరింతగా పాపులారిటీ తెచ్చుకుంది.
యామినీ భాస్కర్ : ‘కొత్తగా మా ప్రయాణం, భలే మంచి చౌకబేరం,నర్తనశాల’ లాంటి సినిమాలతో గ్లామర్ గాళ్ గా ఎలివేట్ అయింది యామినీ భాస్కర్. ఆమె ప్రజెన్స్ బిగ్ బాస్ షోకు స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
సింగర్ నోయల్ : టాలీవుడ్ లో ర్యాప్ సింగర్ గానూ, కంపోజర్ గానూ, నటుడిగానూ బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు నోయల్ సీన్. ప్రత్యేకించి కుమారి 21 ఎఫ్ లో విలన్ గా కూడా అదరగొట్టాడు. 2006 నుంచి టాలీవుడ్ లో అన్ని శాఖల్లోనూ సత్తా చాటుకున్న అతగాడు.. బిగ్ బాస్ షో ను అన్ని రకాలుగానూ రక్తికట్టిస్తాడని భావిస్తున్నారు.
మెహబూబా దిల్ సే : యూట్యూబ్ లో యూత్ ఫుల్ వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు మెహబూబా దిల్ సే. అత్యధిక సంఖ్యలో సబ్ స్ర్కైబర్స్ తో యూ ట్యూబ్ లో మంచి ఆదాయాన్ని అందుకుంటున్న ఈ తెలుగు కుర్రోడు.. ఏకంగా బిగ్ బాస్ లోకి అడుగుపెడుతుండడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
అపూర్వ : ఇవివి సత్యనారాయణ ‘మా ఆవిడ మాదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’ సినిమాతో టాలీవుడ్ లో నటిగా అడుగుపెట్టింది అపూర్వ. గ్లామర్ రోల్స్ , వ్యాంప్ కేరక్టర్స్ తో చాలా సినిమాల్లో నటించింది. పలు కన్నడ , తమిళ చిత్రాల్లోనూ అవే తరహా పాత్రలు పోషించింది.
ప్రియా వడ్లమాని : మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి. ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైన ప్రియా వడ్లమాని. ప్రేమకు రైన్ చెక్ అనే మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శుభలేఖలు, హుషారు , ఆవిరి, కాలేజ్ కుమార్ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది .
ఫోక్ సింగర్ మంగ్లి : అసలు పేరు సావిత్రి రాథోడ్. అనంతపురం జిల్లాకు చెందిన ఈమె ప్రముఖ జానపద గాయని. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో ఆమె పాడిన పాటలకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా బంజారా పాటలు పాడడంలో ఆమె ఎక్స్ పెర్ట్. బతుకమ్మ బోణాలకు, సంక్రాంతికి ఆమె పాడే ప్రత్యేక పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
అఖిల్ సార్ధక్ : ‘ముత్యాల ముగ్గు, ఎవరే నువ్వు మోహిని, బంగారు గాజులు’ లాంటి ప్రముఖ సీరియల్స్ లో విలన్ పాత్రలు పోషించాడు అఖిల్ సార్ధక్. నిజానికి సినీ ఫీల్డ్ నుంచి సీరియల్స్ లో కి షిఫ్ట్ అయిన అతడు.. చాలా తక్కువ కాలంలోనే విలన్ గా టెలివిజన్ ఫీల్డ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.