ఏపీ మండలి సమావేశాలు ప్రారంభానికి ముందే మార్షల్స్ లాబీల్లో విరుచుకుపడ్డారు. రైతు సమస్యలపై మండలిలో చర్చించాలని టీడీపీ సభ్యులు లాబీలో నిరసన తెలియజేశారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావుపై మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు కిందపడిపోయారు. దురుసుగా ప్రవర్తించిన మార్షల్స్ పై చర్యలు తీసుకోవాలని మండలిలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.
మార్షల్స్ దురుసుగా వ్యవహరించడంపై టీడీపీ సభ్యులు మండలిలో నిరసనకు దిగడంతో ఛైర్మన్ షరీఫ్ వారిని వారించారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో టీడీపీ సభ్యులు నిరసన విరమించారు. దీంతో వివాదానికి తెరపడినట్టయింది.











