బొజ్జ గణపయ్య పండుగను సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అయితే ఈరోజు రెండు పండుగలు అని చెప్పాల్సి ఉంటుంది. మెగాస్టార్ కుటుంబంలో ఈరోజు రెండు పండుగలు. అందులో ఒకటి వినాయకచవితి అయితే, ఇంకోటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. తన కుటుంబ సభ్యులతో ఆ మెగాకుటుంబం భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకుంది.
మెగా దంపతులు చిరంజీవి-సురేఖ.. రామ్ చరణ్ – ఉపాసన పూజా కార్యక్రమం అనంతరం ఇలా ఫొటో దిగారు. అల్లు ఫ్యామిలీలోనూ వినాయక చవితి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు వినాయకుని ఆశీస్సులు అందుకున్నారు. ప్రస్తుతం ఈ జంట ఫోటో అల్లు అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇతర మెగా హీరోలు ఎవరికి వారు.. ఇళ్లలో పూజా పునస్కారాలు కానిచ్చారు. సినీ ప్రముఖుల వినాయక చవితి సందడిని ఫొటోల రూపంలో అస్వాదిద్దాం.