కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరో మోహన్ బాబు తన కొత్త సినిమా పేరును ప్రకటించారు. దాని పేరు ‘సన్ ఆఫ్ ఇండియా’. అందులో మోహన్ బాబు లుక్ అదుర్సేనని చెప్పాలి. దాదాపు 560 సినిమాల్లో నటించిన మోహన్ బాబు ఈసారి సన్ ఆఫ్ ఇండియాగా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. దీనికి డైమండ్ రత్నబాబు స్క్రిప్టును అందించారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మస్తున్నాయి. ఈరోజు విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో కళ్లల్లోనే మోహన్ బాబు రౌద్రం పలికించారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారని సమాచారం. ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
మోహన్ బాబు గతంలో కూడా దేశభక్తి నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు చేశారు. సామాజిక స్పృహ ఉన్న చిత్రాలు కూడా చేశారు. తన సొంత బ్యానర్ పై కూడా అలాంటి చిత్రాలు అనేకం ఆయన రూపొందించారు. పలుచిత్రాల్లో దేశభక్తి, సామాజిక స్పృహ కలిగించే అనేక డైలాగులు కూడా మోహన్ బాబు వాడుతుంటారు.
ఇలాంటి నేపథ్యంలో ఆయన ‘సన్ ఆఫ్ ఇండియా’ పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించడం అభిమానులకు ఆసక్తికరంగా మారుతోంది.
Announcing 'SON OF INDIA'#SonofIndia#sonofindiatitleposter#HappyIndependenceDay pic.twitter.com/9K5R20EsEs
— Mohan Babu M (@themohanbabu) August 15, 2020