జగన్‌కు సేవ చేసే వ్యక్తి కావాలో జనానికి సేవ చేసేవారు కావాలో తిరుపతి ప్రజలు నిర్ణయించుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. తిరుపతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరుపతి నియోజకవర్గ అభివృద్ధిలో మోడీ ముద్ర ఉందన్నారు. తిరుపతి అభివృద్ధిపై చర్చకు వైసీపీ,టీడీపీ సిద్ధమా అని ఆయన సవాల్ చేశారు. జగన్‌కు వ్యక్తిగత సేవ చేసిన వ్యక్తి ఎంపీగా అర్హులా అంటూ వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని ఉద్దేశించి జీవీఎల్ అన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్నపవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో వ్యంగాస్త్రం సందించారు. దానికి ప్రతిగా సోము కూడ నిన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ రోజు మీడియా సమావేశంలో జీవీఎల్ వైసీపీని విమర్శించారు.
Must Read ;- జనం చెవిలో క్యాబేజీలన్న విజయసాయి.. కోర్టుల చెవిలో పూలన్న సోము